ETV Bharat / entertainment

ఏంటి 'గుంటూరు కారం'లో మహేశ్​కు ఆ లోపం ఉందా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 8:49 AM IST

Updated : Jan 9, 2024, 10:05 AM IST

Mahesh Babu Guntur Kaaram Role
ఏంటి 'గుంటూరు కారం'లో మహేశ్​కు ఆ లోపం ఉందా?

Guntur Kaaram Mahesh Babu Role : రిలీజ్​కు రెడీగా ఉన్న 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు​ పాత్ర గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఆ వివరాలు..

Mahesh Babu Guntur Kaaram Role : సూపర్ స్టార్ మహేశ్​ బాబు లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' రిలీజ్​కు రెడీగా ఉంది. ఈ సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేయనుంది. అయితే తాజాగా సినిమాలోని మహేశ్​ పాత్ర గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే. మహేశ్​ బాబు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు క్లాస్ ఆడియన్స్ ఇటు మాస్​ ఆడియెన్స్​ను బాగా మెప్పిస్తారు. మంచి మార్కెట్ ఉంది. ఆయన ఎంచుకునే స్క్రిప్ట్స్, క్యారెక్టర్స్ ఎప్పుడూ తన అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. అయితే మహేశ్​ గ్లామర్​కు కేరాఫ్ అడ్రస్​ అన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు గ్లామర్​ను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటివరకు ఆయన డీగ్లామర్ రోల్స్​ కూడా చేయలేదు. అలాగే అంగవైకల్యం ఉన్న పాత్రలను కూడా పోషించలేదు.

అప్పట్లో పుష్పను కూడా డీగ్లామర్​, గూనితో కూడిన బాడీ లాంగ్వేజ్​ కారణంగానే మహేశ్​ రిజెక్ట్ చేశారని అంటుంటారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కోసం ఓ అడుగు ముందుకేసి గుంటూరు కారంలో అంగవైకల్యం ఉన్న పాత్ర చేశారనేది లేటెస్ట్ టాక్. ఈ మూవీ ట్రైలర్ గమనించిన కొందరు అభిమానులు మహేశ్ బాబుకు ఒక కన్ను కనిపించదు. మోనోక్యులర్ విజన్​తో బాధపడే వాడిగా మహేశ్​ క్యారెక్టర్ రూపొందించారని చెబుతున్నారు.

అసలే ఈ మధ్య స్టార్ హీరోల పాత్రలను లోపాలతో రూపొందించడం ఎక్కువైంది. రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్, జై లవకుశలో ఎన్టీఆర్ ఈ తరహా పాత్రలు చేసినవారే. ఇప్పుడు మహేశ్​ కూడా గుంటూరు కారం చిత్రంలో కంటి చూపు సమస్య కలిగిన వ్యక్తిగా కనిపించబోతున్నారట. అయితే ఇది ప్రస్తుతానికి ఊహాగానం మాత్రమే. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి ఉండాల్సిందే. ఇకపోతే గుంటూరు కారం చిత్రంలో మహేశ్​కు జోడీగా శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్. రమ్యకృష్ణ, ప్రకాశ్​ రాజ్ ముఖ్య పాత్రలు చేశారు. తమన్ సంగీతం అందించారు. నాగవంశీ నిర్మాతగా ఉన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గుంటూరు కారం' ట్రైలర్​ క్రేజ్​- 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్- సలార్ రికార్డ్ బ్రేక్

సంక్రాంతి సందడి- థియేటర్లలో 'పాంచ్' పటాకా- ఓటీటీల్లో ఏకంగా 19మూవీలు!

Last Updated :Jan 9, 2024, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.