ETV Bharat / entertainment

బ్లాక్‌బస్టర్ బొమ్మ లోడింగ్! 'గుంటూరు కారం' సెన్సార్ కంప్లీట్​- ఈల వేయాలనిపిస్తుందట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 7:46 PM IST

Guntur Kaaram Movie Censor : సూపర్ స్టార్​ మహేశ్ బాబు, డైరెక్టర్​ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీకి సెన్సార్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నాగవంశీ ట్వీట్ చేశారు.

Guntur Kaaram Movie Censor
Guntur Kaaram Movie Censor

Guntur Kaaram Movie Censor : సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ మాస్​ రోల్​లో నటించిన సినిమా గుంటూరు కారం. దీంతో ఆయన ఫ్యాన్స్​ మహేశ్ మాస్​ యాక్షన్​ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో రచ్చరచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్​తో​ అంచనాలను ఓరేంజ్​లో పెంచుకుంటున్నారు. మరోవైపు, ఈ మూవీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫుల్​ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. సినిమా గురించి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్​ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా మూవీకి సెన్సార్ పూర్తయిన విషయాన్ని ట్వీట్​తో చెప్పారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతీ పోస్టర్, ప్రతీ పాట ప్రేక్షకుల అంచనాలకు మించేలాగానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ షేర్ చేశారు. దాంతో పాటు మహేశ్ బాబు రెడ్ షర్ట్ వేసుకొని బీడీ తాగుతున్న మరో ఫొటో కూడా ట్వీట్ చేస్తూ ఆడియన్స్‌ను సిద్ధంగా ఉండమని సిగ్నల్ ఇచ్చారు. "చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలి అనిపిస్తుంది. బ్లాక్‌బస్టర్ బొమ్మ లోడింగ్. జనవరి 4 డేట్ గుర్తుపెట్టుకోండి" అని నాగవంశీ ట్వీట్ చేశారు.

  • చూడగానే మజా వస్తుంది
    హార్ట్ బీట్ పెరుగుతుంది
    ఈల వేయాలి అనిపిస్తుంది!

    blockbuster bomma loading
    remember the date and time
    jan4th 💥🔥 pic.twitter.com/gEmcAyiSsN

    — Naga Vamsi (@vamsi84) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు
గుంటూరు కారంలో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పటికే శ్రీలీలతో రెండు పాటలు విడుదల కాగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్‌ను మాత్రం ఇన్నాళ్లకు రివీల్ చేసింది మూవీ టీమ్. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాటు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.

జనవరి 6న ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు అదే రోజు ప్రీ రిలీజ్‌ను కూడా ఏర్పాటు చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. హైదరాబాద్‌లోని యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్​ను నిర్వహించబోతున్నట్లు తెలిసింది. అయితే ఈ ఈవెంట్‌ను అమెరికాలో ఉండే ఫ్యాన్స్ కూడా లైవ్ చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.

ట్రెండ్ సెట్టర్ మహేశ్​- యూఎస్​​లో ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్​- సినీ చరిత్రలో తొలిసారి!

'ఫైట్ సీక్వెన్స్‌లు, ఎమోషన్లు, కుర్చీ సాంగ్- ఓ రేంజ్​లో చివరి 45నిమిషాలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.