ETV Bharat / entertainment

Ganja Shankar Movie : సుప్రీం హీరో 'గాంజా శంకర్' గ్లింప్స్​ ఔట్.. 'లోకల్​ మ్యాన్'​గా పక్కా మాస్​లుక్​లో సాయిధరమ్ తేజ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 9:55 AM IST

Updated : Oct 15, 2023, 10:46 AM IST

Ganja Shankar Movie : టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్-సంపత్ నంది కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్​ను మూవీ యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది.

Ganja Shankar Movie
Ganja Shankar Movie

Ganja Shankar Movie : మెగాహీరో సాయిధరమ్ ​తేజ్ - దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సితారా ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ రూపొందిస్తున్నారు. అయితే ఆదివారం హీరో సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా.. మూవీటీమ్ సినిమా టైటిల్ అనౌన్స్​ చేసింది. ఈ చిత్రానికి 'గాంజా శంకర్' అనే పేరును ఖరారు చేస్తూ.. వీడియో గ్లింప్స్​ను కూడా రిలీజ్ చేసింది. 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలోతో హీరో క్యారెక్టర్ పక్కా మాస్​గా ఉండబోతుందని చెప్పె ప్రయత్నం చేశారు. ఇక గ్లింప్స్ రిలీజైన గంటకే లక్షల వ్యూస్​తో యూట్యూబ్​లో దూసుకుపోతోంది.

లోకల్ మ్యాన్ కథ.. ఈ సినిమాలో హీరో సాయిధరమ్​ తేజ్.. శంకర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక 'స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కథ కాదు నాన్న.. మన లోకల్ మ్యాన్ కథ ఉంటే చెప్పు' అని ఓ చిన్నారి వాయిస్​తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ఇక హీరో చిన్నప్పుడే చదువు మానేశాడని.. అమ్మానాన్నలు చెబితే వినడని.. జర్దా, గుట్కా వంటి అన్ని అలవాట్లు ఉన్నాయని గ్లింప్స్​లో వివరించారు. అయితే హీరో శంకర్ గంజాయి అమ్ముతాడని క్లియర్​గా చెప్పేశారు.

డైలాగ్ కేక.. మాస్ లుక్​లో కనిపిస్తున్న గాంజా శంకర్.. 'పది ఉంటే పార్క్​లో పంటడు.. పది వేలుంటే పార్క్​ హయాత్​లో ఉంటడు' అనే డైలాగ్​ను గ్లింప్స్​లో జోడించి హైలైట్ చేశారు. అక ఆఖర్లో 'మాక్కికిరికిరి ఆబ్ షురు అస్లీ యాక్షన్' హీరో డైలాగ్​తో వీడియో ముగించేశారు. ఈ గ్లింప్స్​ చూసిన మెగా ఫ్యాన్స్​.. సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో కమ్​బ్యాక్​ ఇచ్చేస్తాడని అంటున్నారు. ​

ఇక సినిమా విషయానికొస్తే.. హీరో సాయిధరమ్​కు ఇది 17వ చిత్రం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కథానాయిక గురించి ఎలాంటి అనౌన్స్​మెంట్ చేయలేదు మూవీ యూనిట్. ఇక త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. సినిమా వచ్చే ఏడాదే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

''బ్రో' మూవీకి పవన్ రెమ్యునరేషన్.. ప్రపంచంలో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు'

Pawan kalyan : పవర్ స్టార్ సినిమాల్లో.. అత్యధికంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు ఎన్నో మీకు తెలుసా..?

Last Updated :Oct 15, 2023, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.