ETV Bharat / entertainment

'దేవర' బ్లడ్ బాత్​ - గ్లింప్స్​ చూస్తే గూస్​బంప్సే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 4:07 PM IST

Updated : Jan 8, 2024, 4:53 PM IST

Devara Movie Glimpse
Devara Movie Glimpse

Devara Movie Glimpse : జూనియర్ ఎన్​టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ఫుల్​ ఆన్​ ఆక్షన్ సీక్వెన్సులతో అంచనాలు పెంచుతున్న ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ గ్లింప్స్ బయటకు వచ్చింది. ఆ విశేషాలు మీ కోసం

Devara Movie Glimpse : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్​టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ 'దేవర'. జాన్వీ కపూర్​, సైఫ్​ అలీఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ మూవీ గురించి అప్​డేట్స్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.​ ఈ నేపథ్యంలో మేకర్స్​ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ గ్లింప్స్​ను నెట్టింట విడుదల చేశారు. ఆద్యంతం ఫుల్ ఆన్​ యాక్షన్​ మోడ్​లో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం అటు ఎన్​టీఆర్​ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది. అలా ఈ వీడియో సినీ లవర్స్​లో అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ముఖ్యంగా ఇందులోని రక్తపు సముద్రం సీన్​తో పాటు మూన్ ఫైట్ సీన్​ అభిమానులకు తెగ నచ్చింది. చివరిలో దేవర డైలాగ్​ కూడా అంచనాలకు మించి అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

ఇటీవలే డెవిల్ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఈ సినిమా నిర్మాత, జూనియర్ ఎన్​టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓ సందర్భంలో దేవర గురించి ప్రస్తావన రాగా, ఫ్యాన్స్ అంచనాలు మించేలా ఈ సినిమా రూపొందుతుందంటూ కల్యాణ్ రామ్ హింట్ ఇచ్చారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందన్న ఆయన, తాజా అప్​డేట్​ గురించి ఫ్యాన్స్ అడుగుతుంటే ఒత్తిడి కలుగుతుందన్నారు. అయినప్పటికీ వీలైనంత త్వరగా అభిమానులకు గుడ్​ న్యూస్​ చెబుతామంటూ వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Devara Movie Cast: ఈ సినిమాలో ఎన్​టీఆర్​, జాన్వీ కపూర్​తో పాటు సైఫ్ అలీ ఖాన్​ నటిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, షైన్​ టామ్ చాకో, చైత్ర రాయ్ లాంటి స్టార్స్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువసుధ బ్యానర్స్​పై ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్​లో రూపొందుతోంది.

వెయ్యి కోట్లకుపై బడ్జెట్​తో ప్రభాస్, ఎన్​టీఆర్ సినిమాలు! - పాన్​ఇండియా రేస్​లో మనోళ్లదే హవా!

Devara VFX : 'దేవర' షాకింగ్​ న్యూస్​.. రూ.100కోట్ల బడ్జెట్​తో వీఎఫ్​ఎక్స్​ షురూ..

Last Updated :Jan 8, 2024, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.