ETV Bharat / entertainment

నాని నట విశ్వరూపం.. క్లైమాక్స్​ అదుర్స్​.. 'దసరా' ట్విట్టర్​ రివ్యూ

author img

By

Published : Mar 30, 2023, 7:08 AM IST

Updated : Mar 30, 2023, 8:41 AM IST

dasara movie review
dasara movie review

నేచురల్​ స్టార్​ నానీ నటించిన పాన్​ ఇండియా సినిమా 'దసరా'. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం టాక్​ వచ్చేసింది. 'దసరా' ప్రీమియర్​ షోలు చూసిన.. ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్​ వేదికగా పంచుకుంటున్నారు.

నేచురల్​ స్టార్​ నానీ నటించిన పాన్​ ఇండియా సినిమా 'దసరా'. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం టాక్​ వచ్చేసింది. 'దసరా' ప్రీమియర్​ షోలు చూసిన.. ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్​ వేదికగా పంచుకుంటున్నారు.
ఈ సినిమాలో నాని తన కెరీర్​​ బెస్ట్​ పెర్ఫామెన్స్​ ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. ఇంటర్వెల్​ పార్ట్​ అదిరిపోయిందని చెబుతున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు సంతోష్​ నారాయణన్​ ఇచ్చిన బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​.. వాటిని ఎలివేట్​ చేసిందని అంటున్నారు. ఇక, డైరెక్టర్​.. అన్ని తెలుగు సినిమాల లానే.. టాలీవుడ్​ ప్రేక్షకులు కోరుకునే హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడని.. స్టోరీ లైన్​ కూడా బాగుందని చెబుతున్నారు. కాగా, రూ.5 కోట్ల ఖర్చుతో తెరకెక్కించిన భారీ క్లైమాక్స్​.. సినిమాను మరో లెవెల్​కు తీసుకెళ్లిందని ట్విట్టర్​ వేదికగా అభిప్రాయపడుతున్నారు. ​నాని, కీర్తి సురేష్​ మధ్య ఎమోషన్​ సీన్స్, పతాక సన్నివేశాల్లో వచ్చే ఫైట్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. అయితే, సెకండ్​ హాఫ్​లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు ఉన్నాయని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో.. వరల్డ్​వైడ్​గా 3 వేలకు పైగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పటివరకు అతి తక్కువ సినిమాలు మాత్రమే 3 వేలు.. అంతకన్నా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల అయ్యాయి. 'బాహుబలి-1', 'బాహుబలి-2' ​, 'సైరా', 'సాహో', 'రాధేశ్యామ్‌', 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'లైగర్‌'.. ఇప్పటివరకూ అత్యధిక థియేటర్స్‌లో విడుదలైన తెలుగు చిత్రాలుగా రికార్డుకెక్కాయి. ఇప్పుడు ఈ లిస్ట్​లోకి నాని సినిమా కూడా చేరింది.ఇదివరకు లవర్ బాయ్​గా, బాయ్​ నెక్స్ట్​ డోర్​గా కనిపించిన నాని.. ఈ సినిమాలో ఇప్పటివరకూ చూడని సరికొత్త లుక్‌లో రగ్డ్​గా కనిపించారు. కీర్తి సురేశ్​, నాని జంట మరోసారి హిట్​టాక్​ సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలో సముద్ర ఖని, దీక్షిత్​ శెట్టి, శైన్​ టాక్​ చాకో, సాయి కుమార్​, శమ్మ కాసిం, సజోల్​ చౌదరీ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్​గా సత్యం సూర్యం వ్యవహరించారు. సుధాకర్​ చెరుకూరి నిర్మించగా.. నవిన్​ నూలి ఎడిటింగ్​ చేశారు. కాగా. ఈ చిత్రానికి నాని రూ.15 కోట్లు, కథానాయిక కీర్తి సురేశ్​ రూ.2 కోట్ల వరకు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ముందు నాని రూ.12 కోట్లు వరకు తీసుకునేవారట. అయితే, ఇందులో నిజమెంతో తెలియదు.

Last Updated :Mar 30, 2023, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.