ETV Bharat / entertainment

రొమాంటిక్‌ లవ్​స్టోరీస్​ అన్నీ ఒకే చోట.. ట్రైలర్​ చూశారా?

author img

By

Published : Feb 2, 2023, 11:26 AM IST

బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన ప్రేమకథలను తెరకెక్కించిన నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ప్రేమకథలు క్లాసిక్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల గురించి.. మూడు తరాల తారలు.. తమ అనుభవాలను ఒకే చోట పంచుకుంటే చూడాలనుందా?.. వాటినే నెట్‌ఫ్లిక్స్‌ 'ది రొమాంటిక్స్‌' పేరిట ఓ ప్రత్యేక వెబ్​సిరీస్​ను రూపొందించింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకుంటున్న ఆ వీడియోను మీరు చూసేయండి..

Romantic love stories
రొమాంటిక్‌ లవ్​స్టోరీస్​ అన్నీ ఒకే చోట.. ట్రైలర్​ చూశారా?

గతాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేం కానీ అందులోని మధురమైన అనుభూతుల్ని, కచ్చితంగా ఇప్పటి తరాలకు చూపించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సినిమా అంటే అందరూ భారీ హంగులతో రూపొంతున్న యాక్షన్​ను చూసేందుకు ఇష్టపడుతున్నారను కానీ ఒకప్పుడు మనసుకు హత్తుకునే ప్రేమ కథలకు ఎక్కువ మొగ్గు చూపేవారు. ముఖ్యంగా ఈ లవ్​స్టోరీస్​కు బాలీవుడ్​ పెట్టింది పేరు. అక్కడ ఎన్నో అద్భుతమైన ప్రేమకథలను తెరకెక్కించింది నిర్మాణ సంస్థ 'యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌'. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ప్రేమకథలు అన్నీ క్లాసిక్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల గురించి.. మూడు తరాల తారలు.. తమ అనుభవాలను ఒకే చోట పంచుకుంటే చూడాలనుందా?.. ఇప్పుడు అనుభవాలన్నింటినీ ఒకే చోటకు చేర్చేందుకు నెట్ ఫ్లిక్స్ శ్రీకారం చుట్టింది. 'ది రొమాంటిక్స్' పేరుతో రూపొందించిన నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ వెబ్ సిరీస్​ను త్వరలో విడుదల చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్​ను కూడా విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఈ వెబ్​సిరీస్​లో ఇండియన్ మూవీ హిస్టరీని గొప్ప మలుపు తిప్పిన చాందిని, లమ్హే, దిల్​ వాలే దుల్హనియా లేజాయేంగే, కాలా పత్తర్, కభీ కభీ, సిల్శిలా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్​ను.. వాటిలో నటించిన యాక్టర్స్​ ద్వారా వాళ్ళ అనుభవాలను తెలియజేయబోతున్నారు. అమితాబ్ బచ్చన్, షారుక్​ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్​వీర్​ సింగ్, రణ్​బీర్​ కపూర్, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, జుహీ చావ్లా, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురి దీక్షిత్, ఐశ్వర్యా రాయ్, దివంగత రిషి కపూర్ తదితరులు మాట్లాడిన మాట్లలను ఇందులో చూపించబోతున్నారు. ఇకపోతే తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వని ఆదిత్య చోప్రా మొదటిసారి ఈ వెబ్​సిరీస్​తో మాట్లాడబోతుండటం విశేషం.

ఇదీ చూడండి: బ్రహ్మానందం.. ఇలా కన్నీరు పెడుతూ డైలాగ్​ చెప్పడం చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.