ETV Bharat / entertainment

Bhagavanth Kesari Trailer : అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి వచ్చేసిండు.. యాక్షన్​ అండ్ ఎమోషనల్​గా ట్రైలర్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 8:41 PM IST

Updated : Oct 8, 2023, 10:36 PM IST

Bhagavanth Kesari Trailer : నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' ట్రైలర్ వచ్చేసింది.

Bhagavanth Kesari Trailer : అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి వచ్చేసిండు
Bhagavanth Kesari Trailer : అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి వచ్చేసిండు

Bhagavanth Kesari Trailer : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య భగవంత్ కేసరి మాసివ్​ ట్రైలర్ వచ్చేసింది. ఈ ప్రచార చిత్రం లాంఛ్​ ఈవెంట్​ను వరంగల్​లో గ్రాండ్​గా నిర్వహించారు. ఈ ఈవెంట్​కు భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు తరలివచ్చారు. స్టేజ్​ డ్యాన్స్​ షోలు, అభిమానుల కేరింతల మధ్య ఈ ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఆ ప్రచార చిత్రం ఆద్యంతం ఎంతో పవర్​ ఫుల్​గా సాగింది. సినిమాలో మాస్‌, యాక్షన్‌ అంశాలతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్య డైలాగ్స్​, యాక్షన్​ సీన్స్​తో పాటు.. శ్రీలీల ఎమోషనల్​ యాక్టింగ్​ కూడా ఆకట్టుకునేలా ఉంది.

'నువ్వేడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలే.. అప్పుడే ధునియా నీ బాంచెన్ అంటది' అంటూ తెలంగాణ యాసలో సాగే డైలాగ్స్‌తో ప్రారంభమైంది ట్రైలర్​. బిడ్డను ఆర్మీ సెలెక్షన్స్​కు పంపే ప్రయత్నం చేసే తండ్రి పాత్రలో బాలకృష్ణ కనిపించారు. అయితే ఆర్మీ సెలక్షన్స్ అంటే ఇష్టం లేని శ్రీలీలను విలన్లు ఎత్తుకురావడం, వారి నుంచి ఆమెను బాలయ్య కాపాడటం వంటివి చూపించారు. 'ఎత్తిన చెయ్యెవనిదో తెలియాలే.. లేచిన నోరెవనిదో తెలియాలే.. మిమ్మల్ని పంపిన కొడుకెవడో తెలియాలే..' అంటూ బాలయ్య చెప్పిన ఊరమాస్‌ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. కాగా, ఇప్పటికే రిలీజైన టీజర్​, సాంగ్స్​తో పాటు ఇతర ప్రచార చిత్రాలకు.. ఆడియెన్స్​ నుంచి మంచి ఆదరణ దక్కింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagavanth Kesari Release Date : ఈ సినిమాలో ప్రముఖ తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ పవర్​ ఫుల్​ విలన్​గా బాలయ్యతో తలపడనున్నారు. బాలయ్య సరసన కాజల్​ అగర్వాల్ నటించారు. కాజల్​ నటసింహానికి భార్యగా కనిపించనున్నారట. మరో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్​ 19న గ్రాండ్​గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్‌- సంగీతం, సి.రామ్‌ ప్రసాద్‌ - ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు. షైన్ స్క్రీన్స్​ బ్యానర్​పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించారు.

Bhagavanth Kesari Trailer : 'భగవంత్ కేసరి' బ్లాస్టింగ్​.. ఊహకందని రేంజ్​లో ట్రైలర్​ అప్డేట్​

Balakrishna Unstoppable 3 : ఓవైపు భగవంత్​ కేసరి.. మరోవైపు అన్​స్టాపబుల్​-3.. బాలయ్య ఫ్యాన్స్​కు డబుల్​ ట్రీట్​!

Last Updated : Oct 8, 2023, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.