ETV Bharat / entertainment

వెబ్​సిరీస్​లో బాలయ్య.. ఇక ఓటీటీలో దబిడి దిబిడే!

author img

By

Published : Mar 4, 2023, 5:44 PM IST

Updated : Mar 4, 2023, 6:24 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ వెబ్ సిరీస్ చేయనున్నారా?.. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆ వివరాలు..

nandamuri bala krishna in aha web series
nandamuri bala krishna

నటసింహం నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. వరుస సినిమాల షూట్లతో బిజీగా ఉండే ఈ స్టార్​ హీరో.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా అన్​స్టాపబుల్​ సెలబ్రిటీ టాక్​ షోను దిగ్విజయంగా నడిపించారు. ఇలా అన్నింటిని బ్యాలెన్స్​ చేస్తున్న ఈ నందమూరి హీరో.. త్వరలో 'ఆహా' కోసం ఓ వెబ్ సిరీస్ చేయనున్నారని టాక్​ నడుస్తోంది. అందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్లు వేస్తున్నారని సమాచారం.

ఇప్పటికే ఆహాలో స్ట్రీమ్ అయిన అన్​స్టాపబుల్​ సీజన్​ 2కు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్​ వచ్చింది. ఇందులో బాలకృష్ణ హోస్టింగ్​ కూడా అదిరిపోయేలా ఉంది. అయితే బాలకృష్ణను ఈ డిజిటల్ వేదికపై తీసుకురావడం వెనుక నిర్మాత అల్లు అరవింద్ కృషి ఉందట. మరి ఇప్పుడు బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేయిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఆయనదే అని టాక్​. ఒక వేళ ఈ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే బాలకృష్ణను వెబ్ సిరీస్​లో చూసే ఛాన్స్​ దొరికినట్లే.

'అన్​స్టాపబుల్' షోతో మారిన రేంజ్..
'ఆహా'కు పేరుతో పాటు ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకొచ్చిన షోగా 'అన్‌స్టాపబుల్' నిలిచింది. దీని మొదటి సీజన్ సూపర్ హిట్​ అవ్వడంతో రెండో సీజన్​పై దృష్టి పెట్టింది ఆహా టీమ్. అలా రెండో సీజన్​లో నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్​, ప్రభాస్, పవన్ కల్యాణ్​, కిరణ్ కుమార్ రెడ్డి, జయసుధ, జయప్రద లాంటి సినీ రాజకీయ సెలబ్రిటీలను షోకు తీసుకు వచ్చారు. మరోవైపు యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. అన్​స్టాపబుల్​కు వచ్చి సందడి చేశారు. దీంతో ఆహాకు ఇంతటి పాపులారిటీ తెచ్చిన బాలకృష్ణతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోందట 'ఆహా' టీమ్​. ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.

Last Updated :Mar 4, 2023, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.