ETV Bharat / entertainment

అదీ బాలయ్య మంచి మనసు అంటే.. ఈ విషయం తెలిస్తే ఎవరైనా జై కొట్టాల్సిందే!

author img

By

Published : Aug 10, 2023, 9:23 PM IST

బాలయ్య గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. అది తెలుసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్​.. మా బాలయ్య ఎప్పుడూ రియల్​ హీరోనే అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇతర హీరోల అభిమానులు కూడా బాలయ్యను తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే..

Balakrishna remuneration
అదీ బాలయ్య మంచి మనసు అంటే.. ఈ విషయం తెలిస్తే ఎవరైనా జై కొట్టాల్సిందే!

Balakrishna remuneration : అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ బాలయ్యకు మాత్రం డై హార్డ్​ ఫ్యాన్స్​ ఉంటారు. బాలయ్య పైకి కాస్త కోపంగా కనిపించినప్పటికీ.. ఆయన మనసు వెన్న అని చాలా మంది అభిమానులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులు చెబుతూనే ఉంటారు. అసలాయన పేరు వింటేనే సిచ్యూవేషన్​తో సంబంధం లేకుండా ఎవరిలోనైనా ఊపు రావాల్సిందే.

అయితే బాలయ్య ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్​లో ఉన్న సంగతి తెలిసిందే. 'అఖండ'తో మొదలైన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ జర్నీ 'వీరసింహారెడ్డి', బుల్లితెరపై టాక్​షో అంటూ అన్ స్టాపబుల్​గా దూసుకుపోతోంది. ఇప్పుడు ఆయన ఫన్ డైరెక్టర్​ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి సినీ అభిమానులకు తెలిసిన విషయమే.

అయితే తాజాగా బాలయ్య బాబు గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. బాలయ్యకు తన తోటి హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. అయినప్పటికీ బాలయ్య మిగతా హీరోలతో పోలిస్తే కాస్త తక్కువ రెమ్యూనరేషనే తీసుకుంటారట. నిర్మాతల పరిస్థితి ఆధారంగా ఆలోచించి పారితోషికాన్ని డిసైడ్ చేస్తారని తెలిసింది. వారిని ఇబ్బంది పెట్టకుండా తన కష్టానికి తగ్గట్టుగానే తీసుకుంటారట. ఈ విషయం బయట పలు కథనాల్లో రాసి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు, సినీ ప్రియులు... బాలయ్య బాబు రియల్​ హీరో అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. అందుకే బాలయ్యను దర్శకనిర్మాతల హీరో అంటారని అంటున్నారు.

Balakrishna Bhagwant Kesari Teaser : ఇక బాలయ్య భగవంత్ కేసరి విషయానికొస్తే.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 17న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్​, శ్రీలీల, శరత్​కుమార్​, బాలీవుడ్ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య రిలీజైన టీజర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా కాన్సెప్ట్​ పోస్టర్​ కూడా ఆసక్తిని రేపింది. ఈ సినిమా నటీనటులు వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. దీని తర్వాత వైవిధ్య కథల దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్​లో చేస్తారని ఆ మధ్య ప్రచారం సాగింది.

Balakrishna record : బాలయ్య.. మజాకా.. అదీ నటసింహం రేంజ్​.. ఏ హీరోకు సాధ్యం కాని మైండ్ బ్లాక్​ రికార్డ్

లైనప్​తో బాలయ్య ఫుల్​ బిజీ.. ఆ సీనియర్​ డైరెక్టర్​కు ఛాన్స్​ దొరుకుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.