ETV Bharat / entertainment

Balakrishna Hat Trick Hits : హ్యాట్రిక్​ హిట్స్​తో ట్రెండ్ సెట్ చేసిన బాలకృష్ణ.. ఆ హీరోలే టార్గెట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 5:31 PM IST

Updated : Oct 30, 2023, 5:40 PM IST

Balakrishna Hat Trick Hits : నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్నారు. హ్యాట్రిక్ హిట్స్​ను తన ఖాతాలో వేసుకున్నారు. అలానే టాలీవుడ్​ సీనియర్​ హీరోలకు ఒక బెంచ్​మార్క్​ను సెట్​ చేశారు.

Balakrishna Hat Trick Hits
Balakrishna Hat Trick Hits

Balakrishna Hat Trick Hits : ఆరుపదుల వయసులో కూడా నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్స్​తో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరనరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్స్ హిట్ సాధించి పుల్ జోష్​లో ఉన్నారు. దసరా కానుకగా విడుదలైన 'భగవంత్ కేసరి' సినిమా హిట్​ టాక్​ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. వరసగా మూడోసారి భగవంత్ కేసరి సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టారు బాలకృష్ణ. దీంతో సీనియర్​ హీరోలకు ఒక బెంచ్​మార్క్​ను సెట్​ చేశారు.

'అఖండకు' ముందు బాలకృష్ణ కేరీర్​లో ఒక్క సినిమా కూడా రూ.100 కోట్ల మార్క్​ను దాటలేదు. సినిమాలు సూపర్ హిట్​గా నిలిచినా.. రూ.40 కోట్లు దాటేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు సూపర్​ హిట్స్​తో సెంచరీలు కొడుతున్నారు. 'అఖండ' విజయంతో ఆయన మార్కెట్​ అమాంతం పెరిగిపోయింది.

Balakrishna Upcoming Projects : మరోవైపు.. బాలకృష్ణ ఎన్​బీకె109 వర్కింగ్ టైటిల్​తో బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత 110వ చిత్రం బోయపాటి శ్రీను డైరెక్షన్​లో చేస్తున్నట్లు సమాచారం. 'అఖండ' సీక్వెల్​గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీక్వెల్​లో అఘెర పాత్రతో పాటు పొలిటికల్ టచ్​​ ఇచ్చేలా దర్శకుడు బోయపాటి ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆ తర్వాత గోపిచంద్ మలినేని, పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే అవకాశాలున్నాయని సమాచారం.

వచ్చే ఏడాదే 'ఆదిత్య 369' సీక్వెల్!
వచ్చే ఏడాది కోసం పెద్ద ప్లాన్​ను సిద్ధం చేసుకుంటున్నారు బాలకృష్ణ. ఎప్పటి నుంచో ఆయనకు మూడు కోరికలు ఉన్నాయట. వాటి కోసం ఆయన చాలా కాలం నుంచి గ్రౌండ్​ వర్క చేస్తున్నారట. అందులో మొట్టమొదటిది 'ఆదిత్య 369'కి సీక్వెల్​ను తెరకెక్కించడం​. ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్​ క్రియేట్​ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అటు బాలయ్యతో పాటు ఇటు మూవీ లవర్స్ కూడా చాలా కాలంగా ఈ స్వీకెల్​ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల 'భగవంత్​ కేసరి' ప్రమోషన్లలో భాగంగా శ్రీలీల చేసిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఈ సీక్వెల్​ గురించి మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్​ను చాలా కాలం క్రితమే ఆయన తెరకెక్కించనున్నట్లు చెప్పారని తెలిపారు. ఇక 'ఆదిత్య 999' కథ సిద్ధంగా ఉందని.. ఒక రోజు రాత్రిలోనే ఈ స్టోరీని రెడీ చేసిన్నట్లు ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Bhagavanth Kesari Thaman: 'మ్యూజిక్ ఔట్​పుట్​కు స్టోరీయే మెయిన్​.. అందుకే భగవంత్​ కేసరి రిజల్ట్​ అలా'

Bhagavanth Kesari Movie Collection : 'దంచవే మేనత్త కూతురా' దెబ్బకు థియేటర్లు షేక్.. రూ.100 కోట్లు ఖాతాలోకి

Last Updated : Oct 30, 2023, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.