ETV Bharat / entertainment

ఆగస్టులో బాలయ్య.. రొమాంటిక్​గా తారా.. హృతిక్ క్రేజీ లుక్

author img

By

Published : Apr 25, 2022, 6:56 AM IST

Updated : Apr 25, 2022, 7:51 AM IST

Balakrishna Anil Ravipudi: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. నటసింహం బాలయ్య, నాగార్జున, ఆలియా భట్, తారా సుతారియా నటించనున్న కొత్త చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

balakrishna anil ravipudi
tara sutaria

Balakrishna Anil Ravipudi: బాలకృష్ణ కొత్త సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మరోపక్క బాలయ్య కొత్త సినిమా కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాని ఆగస్టులో పట్టాలెక్కించనున్నారు. బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాలతో కూడిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్టు సమాచారం. బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని సినిమాకి సంబంధించి మరో కొత్త కబురు వినిపిస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్‌ 10న టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తెలిసింది.

nagarjuna next movie
.

పోరాటానికి సన్నద్ధం: తుది పోరాటం కోసం సన్నద్ధం అవుతున్నారు నాగార్జున. ఆయన కథా నాయకుడిగా.. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్‌' తెరకెక్కుతోంది. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వారం నుంచే హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. నాగార్జున, విదేశీ ఫైటర్లపై చిత్రీకరించనున్న ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ కథలో నాయకానాయికలిద్దరూ ఇంటర్‌పోల్‌ అధికారుల పాత్రల్లో కనిపించనున్నారు. గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ముఖేష్‌.జి.

nagarjuna next movie
సోనాల్

రాకీ, రాణీ ఎప్పుడొస్తున్నారంటే: కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వస్తున్న ప్రేమ కథా చిత్రం 'రాకీ జౌర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ'. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ నాయకా నాయికలు. షబానా అజ్మీ, జయా బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, వయోకామ్‌ 18 సంస్థలు నిర్మిస్తున్నాయి. దీని విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 10న ఈ ప్రేమ జంటను మీ ముందుకు తెస్తామని అలియా, రణ్‌వీర్‌లతో తను దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ కరణ్‌ ప్రకటించాడు. వివాహం అనంతరం సెట్స్‌లో అడుగు పెట్టిన అలియా ఆదివారం నుంచి ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది.

Rocky Aur Rani Ki Prem Kahani
ఆలియా భట్

'హీరోపంటీ-2' పోరాటం: అభిమానులు, బాలీవుడ్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'హీరోపంటీ-2'. టైగర్‌ ష్రాఫ్‌, తారా సుతారియా జంటగా నటిస్తున్నారు. అహ్మద్‌ఖాన్‌ దర్శకుడు. సాజిద్‌ నడియద్‌వాలా నిర్మించారు. ఈనెల 29న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రెండో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్లు చెదిరే పోరాట సన్నివేశాలున్నట్లు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. నాయకానాయికల మధ్య వచ్చే సన్నివేశాలూ భావోద్వేగభరితంగా ఉండనున్నాయి. లైలా అనే ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయని దర్శక నిర్మాతలు తెలిపారు.

tara sutaria
తారా సుతారియా

నిశబ్దం అవసరం: తమిళంలో విజయ వంతమైన చిత్రం 'విక్రమ్‌ వేధా'. మాధవన్‌, విజయ్‌సేతుపతి కథానాయకులు. ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్‌ గాయత్రి ద్వయమే దీనికీ దర్శకులు. ఇందులో వేధా పాత్రను హృత్రిక్‌ రోషన్‌ పోషిస్తున్నాడు. చిత్రంలో తన పాత్ర ఆహార్యానికి సంబంధించిన లుక్‌ను తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. 'గందరగోళంలో నిశబ్దం అవసరం' అంటూ గంభీరంగా ఉన్న హృత్రిక్‌ స్టిల్‌ ఆకట్టుకుంది. మరో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ విక్రమ్‌ పాత్రలో హృత్రిక్‌ను ఢీకొట్టనున్నాడు. రాధికా ఆప్టే ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న వీరి పోరాటాలను థియేటర్లలో చూడవచ్చు.

hrithik roshan vikram vedha look
హృతిక్

గన్ను పట్టిన శిల్ప: మరో అగ్ర కథానాయిక ఓటీటీలో ఆరంగేట్రం చేయనుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ 'ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌'. ఇందులో శిల్పాశెట్టి నటిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. బ్లాక్‌ యూనిఫాంలో, తుపాకీ పట్టుకున్న పోలీసు అధికారిగా ఇందులో శిల్ప కనిపిస్తోంది. తొలిసారిగా ఓటీటీ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని తను ఇన్‌స్టాలో తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వెబ్‌సిరీస్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్నాయి.

shilpa shetty ott
శిల్పా శెట్టి

ఇదీ చూడండి: దుబాయ్​లో రాజమౌళి, మహేష్.. కథపై చర్చలు అక్కడే!

Last Updated : Apr 25, 2022, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.