ETV Bharat / entertainment

60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్​

author img

By

Published : May 25, 2023, 5:53 PM IST

Updated : May 25, 2023, 6:10 PM IST

ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయసులో ఆయన.. ఫ్యాషన్​ ఎంటర్​ప్రెన్యూర్ అయిన రూపాలి బరోవా అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆ వివరాలు..

.
.

ఆశిష్‌ విద్యార్థి.. చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. 'పోకిరి' సినిమాలో పోలీస్​ విలన్ అంటే ఠక్కున గుర్తుపడతారు. ఈయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పురి సహా పలు భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు. అయితే ఇప్పుడాయన రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్​ప్రెన్యూర్ రూపాలి బరోవాను ప్రేమించారు.మే 25న వీరిద్దరి వివాహం.. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఓ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, రూపాలికి.. కోల్‌కతాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయట. కొంత కాలంగా ఆశిష్ విద్యార్ధి.. ఈమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఇక ఆశిష్‌ విద్యార్థి విషయానికొస్తే.. ఆశిష్​ 1962లో దిల్లీలో జన్మించారు. ఆయన తండ్రి మలయాళి కాగా.. తల్లి బెంగాలి. ఆశిష్​ తండ్రి గోవింద్ విద్యార్ధి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్. సంగీత నాటక అకాడమీలో పనిచేసేవారంట. తండ్రి ప్రభావంతోనే ఆశిష్​.. సినిమాల్లోకి వచ్చి మంచి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఆయన 1991 నుంచి సినిమాల్లో రాణిస్తున్నారు. 'కాల్ సంధ్య' అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ‍దాదాపు 11 భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించారు. తన మూడో చిత్రం 'దోర్హ్ కాల్'తో ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్‌ అవార్డును అందుకున్నారు. తెలుగులో 'పాపే నా ప్రాణం' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 'పోకిరి', 'గుడుంబా శంకర్‌' చిత్రాలతో పాపులర్‌ అయ్యారు. రీసెంట్​గా 'రైటర్ పద్మభూషణ్'​ చిత్రంలో కనిపించారు. అలాగే వెంకటేశ్​, రానా ముఖ్యపాత్రల్లో నటించిన 'రానా నాయుడు' వెబ్​సిరీస్​లోనూ విలన్ పాత్రలో యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు.

Ashish Vidyarthi gets hitched for the second time
60 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి' చేసుకున్న 'పోకిరి' విలన్​

మొదటి పెళ్లి, విడాకులు.. 20 ఏళ్ల క్రితం బెంగాలీ నటి రాజోషీని వివాహం చేసుకున్నారు. ఈమె ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్. అలాగే సింగర్ కూడా. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొన్నేళ్ల క్రితం ఈ జంట అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయింది. ఇక అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఆయన ఇప్పుడు మళ్లీ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆశిష్​.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా నడుపుతున్నారు. దేశం మొత్తం తిరుగుతూ చక్కగా వ్లాగ్స్‌ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. దీనికి సబ్‌స్క్రైబర్స్‌ భారీ సంఖ్యలోనే ఉన్నారు.

ఇదీ చూడండి: డైరెక్టర్​ తేజ స్కూల్ నుంచి మరో కొత్త​ అందం.. లక్కీ హ్యాండ్ వర్కౌట్​ అవుతుందా?

Last Updated : May 25, 2023, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.