ETV Bharat / entertainment

వైలెంట్​ మోడ్ రణ్​బీర్​ కపూర్​ - 'యానిమల్'​ మూవీ ఎలా ఉందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 6:41 AM IST

Updated : Dec 1, 2023, 7:45 AM IST

Animal Movie Twitter Review : బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ - సందీప్​ రెడ్డి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'యానిమల్​'. పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాకు ఆడియెన్స్​ రెస్పాన్స్​ ఎలా ఉందంటే ?

Animal Movie  Twitter Review
Animal Movie Twitter Review

Animal Movie Twitter Review : 'కబీర్ సింగ్​' తర్వాత డైరెక్టర్​ సందీప్​ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్​'. రణ్​బీర్ కపూర్, రష్మిక మందన్న లాంటి స్టార్స్​తో రూపొందించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్​లో శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన ఆడియెన్స్​ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందంటే ?

ప్రస్తుతం ఈ సినిమాకు ఓ రేంజ్​ రెస్పాన్స్​ వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు గూస్​బంప్స్​ గ్యారెంటీ అని అంటున్నారు. ఇది ఒక పక్కా యాక్షన్ మూవీ అని.. ఈ సినిమాకు రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్​ ప్లస్​ పాయింట్​ అంటూ ఆయనపై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. మరోవైపు ​డైరెక్షన్ బాగుందని.. సినిమాకు బ్యాక్​గ్రౌండ్​ స్కోర్ హైలైట్​ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఇందులో అందర్నీ ఆకట్టుకొనే ఎలిమింట్స్ చాలా ఉన్నాయని అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇది ఒక మాస్టర్ పీస్ మూవీ అని.. బంధాలు, అనుబంధాల ఆధారంగా వచ్చిన సినిమాల్లో మైలురాయిగా నిలిచే సినిమా అంటూ మరో నెటిజన్​ రాసుకొచ్చారు. 3.21 గంటల సినిమా అంటూ నిడివిని ప్రశ్నించే ప్రేక్షకులకు.. ఈ సినిమా అన్నీ సమాధానాలు చెప్తుందని అంటున్నారు. ప్రతీ సీన్ గూస్​బంప్స్ తెప్పించిందని.. రాగింగ్ ఎపిసోడ్ కేక పెట్టించిందంటూ మరో నెటిజన్​ అభిప్రాయపడ్డారు.

Animal Movie Cast : Animal Movie Cast : ఇక 'యానిమల్​' సిినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాలో రణ్​బీర్ కపూర్​, రష్మిక మందన్నతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ నటించారు.​ నాన్న పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్​ కనిపించగా.. విలన్​ రోల్​లో ధర్మేంద్ర తనయుడు బాబీ దేఓల్​ నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా రణ్​బీర్​ డిఫరెంట్ షేడ్స్​ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. భద్రకాలీ పిక్చర్స్​, టీసిరీస్​ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

'యానిమల్​' ప్రమోషన్స్​లో హార్ట్‌ టచింగ్ మూమెంట్ - కంటెస్టెంట్‌ పాదాలు పట్టుకున్న రణ్‌బీర్‌

రణ్​బీర్​ వైలెంట్​ లుక్​ - సందీప్​ మాస్టర్​ ప్లాన్​ - 'యానిమల్'​లో అదే హైలైట్​!

Last Updated : Dec 1, 2023, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.