ETV Bharat / entertainment

200 కోట్ల క్లబ్​లోకి 'యానిమల్​' మూవీ - రణ్​బీర్​ వన్ మ్యాన్​ షో అదుర్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 2:00 PM IST

Updated : Dec 3, 2023, 2:10 PM IST

Animal Movie Day 2 Collections : రణ్​బీర్ కపూర్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన యానిమల్​ మూవీ రెండు రోజు కూడా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం రెండో రోజు ఎంత సాధించిందంటే ?

Animal Movie Day 2 Collections
Animal Movie Day 2 Collections

Animal Movie Day 2 Collections : భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తోంది 'యానిమల్​' మూవీ . సందీప్​ రెడ్డి వంగా మార్క్​తో తెరకెక్కిన ఈ సినిమా అటు విడుదలైన అన్ని థియేటర్లలో మంచి టాక్ అందుకుని దూసుకెళ్తోంది. తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో రోజు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 236 కోట్ల కలెక్షన్స్‌ సాధించింది. ఈ విషయాన్ని 'యానిమల్'​ మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది.

మరోవైపు ఈ సినిమా గురించి నెట్టింట హిట్ టాక్ వినిపిస్తున్నప్పటికీ అక్కడక్కడ నెగిటివిటీ కూడా చెలరేగుతోంది. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమాలో రణ్​బీర్ నటనకు ఫిదా అవుతున్నారు. డిఫరెంట్ షేడ్స్​లో నట విశ్వరూపాన్ని చూపించారంటూ ఈ బాలీవుడ్ స్టార్​ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన క్యారెక్టర్​కు 100 పర్సెంట్​ న్యాయం చేశారంటూ రణ్​బీర్​ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇక రష్మిక, అనిల్ కపూర్, బాబీ దేఓల్​ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

Animal Movie Sequel Update : మరోవైపు ఈ సినిమా అటు సెంటిమెంట్​తో పాటు వయోలెన్స్​ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. పైగా పోస్ట్ క్రెడిట్​ సీన్​లో ఈ సినిమాకు సీక్వెల్​ ఉండనుందని డైరెక్టర్​ రివీల్​ చేశారు. దీంతో రానున్న 'యానిమల్​ పార్క్​'పై మరింత ఎక్స్​పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ఇదే టాక్ కొనసాగితే యానిమల్‌ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్​ దాటడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Animal Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాలో రణ్​బీర్​ కపూర్​తో పాటు రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ దేఓల్​, అనిల్‌ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్​తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్​ను పెంచారు. ​మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అక్కడక్కడ నెగిటివ్​ టాక్ అందుకున్నప్పటికీ.. అవేవి నిజం కావంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

'యానిమల్' తొలి రోజు కలెక్షన్స్ రూ.116 కోట్లు - సందీప్​ రెడ్డి మాస్​ పల్స్​ పట్టేశాడుగా!

'యానిమల్​' మూవీలో బోల్డ్​ బ్యూటీ - ఎవరీ తృప్తి ?

Last Updated : Dec 3, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.