ETV Bharat / entertainment

రికార్డు స్థాయిలో 'యానిమల్​' బుకింగ్స్​ - ఫస్ట్​ డే ఎంత వసూలు చేయనుందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 2:04 PM IST

Animal Movie Box Office Prediction
Animal Movie Box Office Prediction

Animal Movie Box Office Prediction : బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ - సందీప్​ రెడ్డి కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'యానిమల్​'. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్​ బుకింగ్స్ ఎలా సాగిందంటే ?

Animal Movie Box Office Prediction: బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'యానిమల్​'. హై వయోలెన్స్​ మోడ్​లో సందీప్​ రెడ్డి రూపొందించిన ఈ సినిమా డిసెంబర్​ 1 న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​, సాంగ్స్​తో భారీ అంచనాలు నెలకొల్పిన మూవీ టీమ్.. ఇటీవలే జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్​తో మూవీకి మరింత హైప్​ పెంచేసింది. ఇందులో రణ్​బీర్​ లుక్స్​కు ఫిదా అయిన ఫ్యాన్స్​ బిగ్ స్క్రీన్​పై ఆయన​ యాక్టింగ్​ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో అడ్వాన్స్​ బుకింగ్స్​ మొదలయ్యాయి. ఓవర్సీస్​తో పాటు ఇండియాలో ఫ్యాన్స్ టికెట్లు బుక్​ చేయడం మొదలెట్టేశారు. అయితే ఈ మూవీ ఇప్పటికే రూ. 19.7 కోట్లు సంపాదించిందట. సూమారు 12,539 స్క్రీనింగ్స్​లో ఇప్పటివరకు 7,45,992 టిక్కెట్లు మేర అమ్ముడుపోయాయని సమాచారం. అందులో హిందీలో 5,75,197 టికెట్లు కాగా.. 1,63,361 తెలుగు బుకింగ్స్ కావడం విశేషం. అయితే భారత్​లో ఈ మూవీ రూ. 65 కోట్ల, అలాగే ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లు గ్రాస్​ వసూలు చేస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రెండు భాషల్లో ఏరియా వైజ్​ ఎంత బుక్కింగ్స్ జరిగాయంటే..

దిల్లీ - రూ. 4.07 కోట్లు

తెలంగాణ - రూ. 4.14 కోట్లు

మహారాష్ట్ర - రూ. 3.29 కోట్లు

ఆంధ్రప్రదేశ్ -రూ. 2.18 కోట్లు

కర్ణాటక - రూ. 2.23 కోట్లు

గుజరాత్ -రూ. 1.49 కోట్లు

ఉత్తర్​ప్రదేశ్ - రూ. 1.34 కోట్లు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Animal Movie Cast : ఇక 'యానిమల్​' సిినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాలో రణ్​బీర్ కపూర్​, రష్మిక మందన్నతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ నటించారు.​ నాన్న పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్​ కనిపించగా.. విలన్​ రోల్​లో ధర్మేంద్ర తనయుడు బాబీ దేఓల్​ నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా రణ్​బీర్​ డిఫరెంట్ షేడ్స్​ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. భద్రకాలీ పిక్చర్స్​, టీసిరీస్​ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'యానిమల్'​ మూవీకి సెన్సార్ షాక్​ - ఆ ఇద్దరి సీన్స్​పై అభ్యంత్రం - 'A' సర్టిఫికేట్ ఇచ్చాక మార్పులు!​

నార్త్​లో రాణిస్తున్న యంగ్ డైరెక్టర్లు - అట్లీ, సందీప్​లో ఆ సౌత్‌ రికార్డ్‌ ఎవరికి సొంతమవ్వనుందంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.