ETV Bharat / entertainment

Anand Deverakonda Vaishnavi : 'బేబీ' కాంబో రిపీట్.. స్టోరీ ఆయనదే.. సూపర్ హిట్ పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 8:01 PM IST

Updated : Oct 20, 2023, 8:30 PM IST

Anand Deverakonda Vaishnavi Movie : 'బేబీ' సినిమా కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఈ సూపర్ హిట్ జంట రెండోసారి స్క్రీన్​ ​షేర్ చేసుకోనుంది. ఈ మేరకు మూవీ యూనిట్ సోషల్ మీడియాలో మరిన్ని వివరాలు షేర్ చేసింది.

Anand Deverakonda Vaishnavi
Anand Deverakonda Vaishnavi

Anand Deverakonda Vaishnavi Movie : టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ, నటి వైష్ణవీ చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జోడీకి సైతం ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సక్సెఫుల్​ జోడీ మరోసారి తెరపై మెరవబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ సినిమా పోస్టర్​ను కూడా రిలీజ్ చేసింది.

'3 రోజెస్‌' వెబ్‌సిరీస్‌కు రచయితగా, 'ప్రతిరోజూ పండగే' సినిమాకు కో రైటర్‌, చీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రవి నంబూరి.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. కాగా, ఈ సినిమాకు బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్.. కథ అందించారు. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేశ్ ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు. 'కల్ట్ కాంబో ఈజ్ బ్యాక్​. చిత్రానికి కథ రాసింది నేనే. నా మిత్రుడు రవి నంబూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు' అని రాసుకొచ్చారు. ఈ సినిమాను 'బేబీ' నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాను 2024 సమ్మర్​లో విడుదల చేయనున్నట్లు మూవీయూనిట్ తెలిపింది.

'చాంగురే బంగారు రాజా' ఓటీటీ.. కామెడీ క్రైమ్ జానర్​లో తెరకెక్కిన 'చాంగురే బంగారు రాజా' చిత్రం ఓటీటీ రిలీజ్​కు రెడీ అయ్యింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ప్లాట్​ఫామ్​ వేదికగా అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ ఆర్​టీ (RT) ప్రొడక్షన్ బ్యానర్​పై నిర్మించారు. సతీష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక సెప్టెంంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్​డ్ టాక్​ సొంతం చేసుకుంది. కేరాఫ్ కంచరపాలెం మూవీ ఫేమ్.. కార్తీక్ రత్నం హీరోగా నటించగా, రవిబాబు, సత్య, అజయ్, ఎస్తర్, నిత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Baby movie chiranjeevi : 'అది చూసి ఆశ్చర్యపోయా.. నా వల్ల కాలేక మూడు రోజులు బయటకు రాలేకపోయా'

Baby Movie OTT : 4గంటల రన్​టైమ్​తో ఓటీటీలోకి 'బేబీ'.. ఆ సీన్స్ అన్నీ యాడ్!

Last Updated : Oct 20, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.