ETV Bharat / entertainment

Amala paul Marriage : రెండో పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌ - వెడ్డింగ్​ పిక్స్​ చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 7:01 PM IST

Updated : Nov 5, 2023, 7:18 PM IST

Amala paul Marriage : హీరోయిన్ అమలా పాల్​ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన ప్రియుడు, ఈవెంట్ మేనేజ‌ర్ జ‌గ‌త్ దేశాయ్‌ను పెళ్లాడింది.

Amala paul Marriage : రెండో పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌ - వెడ్డింగ్​ పిక్స్​ చూశారా?
Amala paul Marriage : రెండో పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌ - వెడ్డింగ్​ పిక్స్​ చూశారా?

Amala paul Marriage : హీరోయిన్ అమలా పాల్​ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రెండో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, ఈవెంట్ మేనేజ‌ర్ జ‌గ‌త్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేర‌ళ‌లోని కొచ్చిలో ఆదివారం (న‌వంబ‌ర్ 5న‌) వీరి వివాహం గ్రాండ్​గా జ‌రిగింది. ఈ శుభ‌వార్త‌ను నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెళ్లి ఫొటోలను షేర్​ చేసి తెలిపారు. 'రెండు మ‌న‌సులు ఒక్క‌టైన వేళ‌.. జీవితాంతం ఈ చేయి వ‌ద‌ల‌ను' అని త‌న పోస్టుకు క్యాప్ష‌న్ జోడించాడు జగత్​. ఈ వివాహ వేడుక‌లో అమ‌లాపాల్ లావెండ‌ర్ క‌ల‌ర్‌ లెహంగా ధ‌రించి ఎంతో అందంగా కనిపించింది. జ‌గ‌త్ కూడా తన ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండ‌ర్ క‌ల‌ర్ షేర్వాణీనే ధరించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో సెల‌బ్రిటీలు, అభిమానులు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

కాగా, హీరోయిన్​ అమలా పాల్.. ప్రేమ ఖైదీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఇద్దరు అమ్మాయిలతో, జెండాపై కపిరాజు, బెజవాడ, నాయక్​ సహా కొన్ని సినిమాలు చేసింది. ఈ జర్నీలోనే కోలీవుడ్ దర్శకుడు విజయ్​ను(Amala paul First Husband) ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని విబేధాల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. డివొర్స్​ అనంతరం ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీస్​లో నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బోల్డ్ ఫొటోషూట్స్​తో రెచ్చిపోయింది. తన గ్లామర్​ ట్రీట్​తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఆ మధ్యలో ముంబయికి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్​తో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయిందన్నారు. అనంతరం పెళ్లి విషయం చెప్పలేదు కానీ.. భవీందర్​ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది అమలా పాల్​.

ఇకపోతే గతకొద్ది కాలంగా అమలా.. జగత్ దేశాయ్​తో ప్రేమలో ఉన్నట్లు రీసెంట్​గా బయటపెట్టింది. లిప్ కిస్​లతో ఫొటోలను పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని అనౌన్స్​ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తమ పెళ్లి జరిగిందని పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది.

టూ మచ్ బోల్డ్​గా కేతిక శర్మ - ఆ కొంటె ఎక్స్​ప్రెషన్స్​కు ఎవరైనా పడిపోవాల్సిందే!

Last Updated :Nov 5, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.