ETV Bharat / entertainment

రెండు భాగాలుగా పవన్-సుజిత్​​ సినిమా.. ఒరిజినల్​ గ్యాంగ్​స్టర్​ అల్లు అరవిందా?

author img

By

Published : Jan 31, 2023, 11:25 AM IST

Updated : Jan 31, 2023, 11:36 AM IST

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌ - సుజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ యాక్షన్​ సినిమా OG గురించి ఓ ఆసక్తికరమైన అనుమానం ప్రేక్షకుల్లో మొదలైంది. అల్లు అరవింద్​ ఈ సినిమా వెనకున్న అసలైన గ్యాంగ్​స్టార్​ అని అనుకుంటున్నారు. ఆ వివరాలు..

Alluarvind is original Gangster  for pawan sujith movie
పవన్-సుజిత్​​ సినిమాలో ఒరిజినల్​ గ్యాంగ్​స్టార్​ అల్లు అరవిందా?

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌ - సుజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ యాక్షన్‌ చిత్రం 'OG'. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో హరీశ్​ శంకర్‌, శ్రీవాస్‌, వివేక్‌ ఆత్రేయ, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా.. సురేశ్​బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దిల్‌రాజు, అరవింద్‌ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ అందించారు.

అయితే గ్యాంగ్​స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్​ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఓ కొత్త ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకు అసలైన ఒరిజినల్​ గ్యాంగ్​స్టర్​ అల్లు అరవింద్​ అనే అనుమానం మొదలైంది. ఎందుకంటే.. అధికారికంగా ఈ చిత్రాన్ని డీవీవీ నిర్మిస్తున్నప్పటికీ.. ఇందులో అరవింద్​ కూడా భాగస్వామ్యమయ్యారని సమాచారం. ఆయన వెనక నుంచి సైలెంట్​గా చిత్రంలో పెట్టుబడులు పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని అల్లు స్డూడియోస్​లో చిత్రీకరించనున్నారట. ఇక సినిమా రిలీజ్​కు సంబంధించిన పనులను ఆయనే చూసుకోబోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ప్రస్తుతం పలు కథనాలు వస్తున్నాయి. మరో విషయమేమిటంటే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని సమాచారం అందుతోంది. తొలి భాగాన్ని త్వరగా పూర్తి చేసి ఈ దసరాకు రిలీజ్​ చేయాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారట. ఈ తొలి భాగంలో ఓ టెర్రిఫిక్​ క్లైమాక్స్​ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే ఈ చిత్రానికి హైలైట్ కానుందట.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. సాహో లాంటి హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్‌ ఈ కథను సిద్ధం చేశారు. పైగా అతను పవన్‌కు వీరాభిమాని కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇంకా ఆర్​ఆర్​ఆర్​ లాంటి భారీ హిట్​ అందుకున్న తర్వాత డీవీవీ.. ఈ సినిమా చేయడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: గ్రాండ్​గా పవన్​-సుజిత్ మూవీ షురూ.. పవర్​స్టార్​ లుక్ సూపర్​!

Last Updated :Jan 31, 2023, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.