ETV Bharat / entertainment

తమిళ్​లోకి 'ఆహా' ఎంట్రీ.. సీఎం చేతులమీదుగా ప్రారంభం

author img

By

Published : Apr 15, 2022, 1:35 PM IST

CM Stalin launches Aha OTT
తమిళ్​లోకి 'ఆహా' ఎంట్రీ

Aha OTT Tamil launch: ఆహా ఓటీటీ తమిళ వెర్షన్​ను గురువారం ప్రారంభించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌. అనంతరం మాట్లాడుతూ తమిళం కోసం ఎక్కడికైన వచ్చేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. అల్లు అరవింద్, భారతిరాజా, ఉదయనిధి తదితరులు హాజరయ్యారు.

Aha OTT Tamil launch: మాటలు తగ్గించి చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఆహా ఓటీటీ తమిళ వెర్షన్‌ ప్రారంభ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిని ముఖ్యమంత్రి.. తమిళం కోసం ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమన్నారు.

" ఈ ఓటీటీ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. తమిళం కోసం అయితే నేను ఏ సమయంలోనైనా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా. ఈ ఓటీటీ పేరు కూడా ఆహా అని ఉంది. చాలా సంతోషంగా ఉన్నప్పుడు 'ఆహా' అంటారని అందరికీ తెలుసు. సమాజానికి ఉపయోగపడేవిధంగా ఈ ఆహా పనిచేయాలని కోరుకుంటున్నా. అందరికీ 'సిత్తిరై తిరునాళ్‌' శుభాకాంక్షలు. ఈ రోజు అంబేద్కర్​ జయంతి. ఆయన జయంతిని సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తామని ఏప్రిల్​ 13న అసెంబ్లీలో ప్రకటించాను. ఇదే రోజున ఆహాను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉంది."

- ఎంకే స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి.

తెలుగులో మంచి సక్సెస్​ సాధించింది ఆహా ఓటీటీ ప్లాట్​ఫామ్. దీంతో తమిళ భాషలోకి తీసుకెళ్లారు అల్లు అరవింద్​. చెన్నైలో గురువారం రాత్రి జరిగిన​ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్‌ దర్శకుడు భారతిరాజా, ఎస్​పీ ముథురామన్​, నిర్మాత కలైపులి థాను తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొమ్మా ఉయ్యాల, ఎఫ్​3 సాంగ్స్​ అప్డేట్స్​.. దూసుకెళ్తున్న ఆచార్య ట్రైలర్​ ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.