ETV Bharat / entertainment

'ఆదిపురుష్' టీమ్​ చేసింది కొత్తేమీ కాదు.. గతంలోనే అలా..

author img

By

Published : Jun 6, 2023, 5:26 PM IST

Adipurush
'ఆదిపురుష్' టీమ్​ చేసింది కొత్తేమీ కాదు.. గతంలోనే అలా..

Prabhas Adipurush Movie : ప్రభాస్​ 'ఆదిపురుష్' టీమ్​ చేసిన ఓ అనౌన్స్​మెంట్​ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అలా చేయడం కొత్తేమి కాదని గతంలోనూ పలు సినిమా టీమ్స్​ ఇలా చేశాయని అంటున్నారు. ఆ వివరాలు..

Prabhas Adipurush Movie : ప్రభాస్​ 'ఆదిపురుష్' టీమ్​ చేసిన ఓ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అందరూ మూవీటీమ్​ చేసిన ప్రకటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదేంటంటే. ఈ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ హనుమంతుడి కోసం కేటాయించుతున్నామని(ఖాళీగా ఉంచడం).. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకు హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ఇలా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలాంటి చేయడం కొత్తేమి కాదంటూ సోషల్​మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో పలు సినిమాలకు ఇలా.. గతంలో పలు తెలుగు చిత్రాలకు ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్స్​ చేశారని గుర్తుచేసుకుంటున్నారు. 1943లోనే భక్త పోతన సినిమా కోసం.. ఆ మూవీటీమ్​.. బెంగళూరులో తమ సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు భారీ హనుమంతుడి కటౌట్ పెట్టించింది. అలా ఆడియెన్స్​ దృష్టిని ఆకర్షించింది. దాన్ని చూసేందుకు వచ్చిన చాలా మంది సినిమాకు వెళ్లడం జరిగిందట.

అనంతరం 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం'(1960), 'అన్నమయ్య'(1997) థియేటర్లలోనూ వేంకటేశ్వరస్వామి విగ్రహాలు పెట్టించారట. 'శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం' థియేటర్ల హుండీ డబ్బులు రికార్డు స్థాయిలో కానుకలు వస్తే.. వాటిని టీటీడీకి ఇచ్చారట. అలానే 'అమ్మోరు' సినిమా ఆడుతున్న సమయంలో ప్రతి థియేటర్ ముందు మట్టితో అమ్మోరు బొమ్మ చేయించి పెట్టడం జరిగిందట. థియేటర్లలో హారతులు కూడా పట్టారట. 'దేవి' చిత్రం ప్రదర్శించిన థియేటర్లో పుట్ట సెటప్​లు పెట్టారట. ఇప్పుడు 'ఆదిపురుష్' కూడా అదే కోవలో కాస్త భిన్నంగా ఆలోచించి హనుమంతుడి కోసం ఖాళీ సీట్ పెట్టిస్తోందని తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

#Adipurush pre release event : కాగా, రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ కృతి సనన్ రాముడు-సీతగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. టీ-సిరీస్​ సంస్థ రూ.550కోట్ల బడ్జెట్​ పెట్టి నిర్మించిందని అని సమాచారం అందింది. అయితే ఈ చిత్ర శాటిలైట్​ డిజిటల్​ రైట్స్​ అన్ని భాషల్లో కలిపి రూ.250కోట్లకు అమ్ముడపోయాయని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో థియేట్రికల్​ రైట్స్​ రూ.185కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. ఇకపోతే ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం.. భారీ సెట్లతో తీర్చిదిద్దిన ప్రీ రిలీజ్ ఈవెంట్​(మే 6) గ్రాండ్​గా జరుగుతోంది.

ఇదీ చూడండి:

ఏంటీ.. 'దసరా' కన్నా 'ఆదిపురుష్'కు తక్కువా?

Prabhas Adipurush : పంచెకట్టులో ప్రభాస్.. శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్​ 'రాఘవుడు' !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.