ETV Bharat / crime

Wife Saved Husband in Warangal : కళ్లలో కారం చల్లి.. భర్తను కాపాడుకున్న భార్య

author img

By

Published : Jan 21, 2022, 10:28 AM IST

Wife Saved Husband in Warangal : ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించింది ఆ మహిళ. ఆపదొస్తే అపరభద్రకాళిలా మారగలదని చూపించింది. వంటింటి కుందేలులా ఉన్నా.. అదే వంటింట్లోని ఆవగింజను ఆయుధంగా మార్చుకోగలనని చాటిచెప్పింది. అమ్మతనానికే కాదు.. అంతులేని ధైర్యానికి తెగింపునకు కేరాఫ్​గా మారి తన మాంగళ్యాన్ని కాపాడుకుంది ఓ నారీమణి.

Wife Saved Husband in Warangal
Wife Saved Husband in Warangal

Wife Saved Husband in Warangal : ఆమె సాధారణ గృహిణి. తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి అపరకాళిలా తిరగబడింది. దుండగుల కళ్లలో కారం చల్లి మాంగల్యాన్ని కాపాడుకుంది. ఈ ఘటన వరంగల్‌ పట్టణంలోని శంభునిపేటలో చోటుచేసుకుంది.

స్థానికులు, సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం..

భర్తను కాపాడిన మహిళ కల్యాణి

Wife Rescued Husband From Murder : ‘ది వరంగల్‌ జిల్లా లారీ అసోసియేషన్‌’ అధ్యక్షుడు వేముల భూపాల్‌ ఇంటికి బుధవారం అర్ధరాత్రి ఆటోలో నలుగురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ముగ్గురు భూపాల్‌ ఇంటిలోకి వెళ్లి ఆయనపై కత్తులతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. వెంటనే భూపాల్‌ భార్య కల్యాణి అప్రమత్తమైంది. వంట గదిలోకి వెళ్లి కారం తీసుకొచ్చి దుండగుల కళ్లల్లో చల్లింది. కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. నిందితులు ముగ్గురూ ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించారు. అరుపులు విని భూపాల్‌ సోదరుడు క్రాంతికుమార్‌ అక్కడికి చేరుకున్నారు. కళ్లల్లో కారం ఎక్కువగా పడడంతో నిందితుల్లో ఒకరైన రంజిత్‌ వారికి చిక్కాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అప్పగించారు.

భూ తగాదాలే కారణం..

Wife Saved Husband From Murder : బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భూపాల్‌, క్రాంతి కుమార్‌ సోదరులతో ఉన్న భూతగాదాల వల్లే ప్రత్యర్థులు హత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.