ETV Bharat / crime

ఫేస్​బుక్​ పరిచయం.. వివాహేతర సంబంధం.. కట్​ చేస్తే..

author img

By

Published : Oct 26, 2022, 7:57 PM IST

Wife Killed Husband
Wife Killed Husband

Wife Killed Husband With Lover Help: ఫేస్​బుక్​ అనే వ్యసనం పచ్చని సంసారంలో నిప్పులు పోస్తోంది. చాలా మంది.. అపరిచితులతో పరిచయాలు పెంచుకుని వివాహేతర సంబంధాలకు పునాదులు వేస్తున్నారు. ఆ సంబంధానికి ఎవరైనా అడ్డుగా ఉన్నారని భావిస్తే చాలు.. వెనకా ముందు చూడకుండా ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీ, నంద్యాల జిల్లాలో జరిగింది. ఫేస్​బుక్​లో పరిచయమైన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇక్కడే అసలు విషయం బయటపడింది..

Wife Killed Husband With Lover Help: ఫేస్​బుక్​ పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు కుట్ర పన్నారు. అనుకున్నట్లుగానే హత్య చేసి ఆపై అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో కరీముల్లా అనే ఆటోడ్రైవర్​ ఈనెల 8వ తేదీన పట్టణ శివార్లలోని విద్యుత్ సబ్​స్టేషన్​ వద్ద గోనె సంచిలో మృతదేహంగా కనిపించాడు. తన భర్త చనిపోయాడంటూ పోలీసులకు అతని భార్య మున్ని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ కావడంతో ఇతర తగాదాలు, భూ వివాదాలు ఏమైనా హత్యకు దారి తీసి ఉంటాయనే కోణంలో భావించి విచారణ చేపట్టారు.

అయితే ఈ ఘటనకు అసలు కారణం కరీముల్లా భార్య వివాహేతర సంబంధమేనని తేలింది. ఆమె కాల్​రికార్డ్స్​, సామాజిక మాధ్యమాల వినియోగంపై దృష్టి పెట్టిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఫేస్​బుక్​లో వైఎస్సార్​ కడప జిల్లా పెద్దముడియం మండలానికి చెందిన వంశీకుమార్​ రెడ్డి అలియాస్​ పవన్​తో ఆమెకు వివాహేతర బంధం ఉందనే విషయం వెల్లడైంది.

ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం తేటతెల్లమైంది. ఈ నెల ఆరో తేదీనే కరీముల్లాను.. ఇంట్లోనే గొంతుకు తాడు బిగించి భార్య, ఆమె ప్రియుడు హత్య చేశారని.. అనంతరం మృతదేహాన్ని ఒక గోనెసంచిలో పెట్టి.. ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి విద్యుత్ సబ్​స్టేషన్​ వద్ద పారేసినట్లు తేలిందని ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఫేస్​బుక్​ పరిచయం.. వివాహేతర సంబంధం.. కట్​ చేస్తే..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.