భవనం కూల్చివేతలో అపశ్రుతి.. ఇద్దరు కూలీలు మృతి

భవనం కూల్చివేతలో అపశ్రుతి.. ఇద్దరు కూలీలు మృతి
Laborers died in Building Collapse : వరంగల్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. చార్‌బౌలిలో పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శిథిలాల కింద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Laborers died in Building Collapse : వరంగల్ నగరంలోని చార్‌బౌలిలో పాతభవనం కూల్చివేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు శిథిలాలకింద ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కార్మికులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు గంటపాటు శ్రమించి వారి మృతదేహాలను బయటకు తీశారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మృతులు సాగర్, సునీతలుగా పోలీసులు గుర్తించారు.
