ETV Bharat / crime

cheating unemployed youth: ఉద్యోగాలపేరిట నిరుద్యోగులకు గాలం.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Oct 11, 2021, 6:53 PM IST

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో (cheating unemployed youth)ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు ఆదిలాబాద్​ జిల్లా ఎస్పీ రాజేశ్​చంద్ర వెల్లడించారు. నిందితుల నుంచి రూ.3 లక్షల నగదు, ఒక కంప్యూటర్​, సీపీయూ, కొన్ని నియామకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Adilabad sp rajesh chandra
Adilabad sp rajesh chandra

అటవీశాఖలో ఉన్నతస్థాయి అధికారినంటూ (cheating unemployed youth for forest department jobs) నిరుద్యోగులకు గాలం వేసి లక్షల రూపాయలు వసూలుచేసిన ఘటన ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్​ మండలంలో చోటుచేసుకొంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

గుడిహత్నూర్​ మండలం ముత్నూర్​కు చెందిన పరచే మోహన్​.. నిరుద్యోగులను మోసం చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు. ఐఎఫ్​ఎస్​ అధికారిగా హైదరాబాద్​లో ఉద్యోగం చేస్తున్నట్లు స్థానికులను నమ్మించాడని వెల్లడించారు. అటవీశాఖలో బీట్​ ఆఫీసర్​, సెక్షన్​ ఆఫీసర్​ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. బాధితులతో ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. వారికి నకిలీ నియామక పత్రాలు అందించాడని.. అందుకు నిర్మల్​ జిల్లా కేంద్రానికి చెందిన నరసయ్య జిరాక్స్​ సెంటర్​లో పనిచేసే ఓ వ్యక్తి సాయం తీసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ రాజేశ్​ చంద్ర వెల్లడించారు.

నకిలీ పత్రాలిచ్చి..

ఆరుగురు బాధితుల నుంచి రూ. 8.6 లక్షల నగదు తీసుకొని.. నకిలీ పత్రాలు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు..ఎస్పీ రాజేశ్​చంద్ర. బాధితులంతా ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా అవి నకిలీవని తేలిందని ఎస్పీ తెలిపారు. వెంటనే బాధితులంతా.. గుడిహత్నూర్​ పోలీస్​స్టేషన్​లో 2020 ఫిబ్రవరి 26న ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

నిందితుల నుంచి మూడు లక్షల నగదు, రూ.50 వేల విలువ చేసే కంప్యూటర్​, సీపీయూ, నకిలీ నియామకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఉద్యోగాలు ఇస్తామని చెబితే మోసపోవద్దని.. పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

'ముత్నూర్​కు చెందిన మోహన్.. అటవీ శాఖ అధికారిగా అందరినీ పరిచయం చేసుకున్నాడు. అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఏడుగురి నుంచి రూ.8.6 లక్షల నగదు తీసుకున్నాడు. వారికి నకిలీ నియామక పత్రాలు అందించారు. బాధితుల ఫిర్యాదులో నిందితులను అరెస్ట్​ చేశాం. మూడు లక్షల నగదు, కంప్యూటర్​, రెండు సెల్​ఫోన్లు, కొన్ని నకిలీ నియామకపత్రాలు స్వాధీనం చేసుకున్నాం.

- రాజేశ్​ చంద్ర, ఆదిలాబాద్​ ఎస్పీ

ఇదీచూడండి: Sheeps felldown in canal: అసలే వరద.. ఆపై గొర్రెల మంద.. ఏమైందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.