ETV Bharat / crime

stab injury: చాయ్ హోటల్​లో గొడవ.. ముగ్గురికి కత్తిపోట్లు

author img

By

Published : Nov 5, 2021, 9:03 AM IST

ఓ చాయ్ హోటల్​లో చెలరేగిన ఘర్షణ కారణంగా ముగ్గురు యువకులు కత్తిపోట్లకు(stab injury) గురయ్యారు. ఒక వర్గానికి చెందిన వారు.. మరో వర్గంపై దాడులు చేసుకున్నారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

stab injury, young men conflicts
యువకుల కత్తిపోట్లు, చాయ్ హోటల్​లో యువకుల ఘర్షణ

జగిత్యాల తీన్ ఖని వద్ద చాయ్ హోటల్​లో జరిగిన గొడవ... ఘర్షణకు దారి తీసింది. చివరకు ముగ్గురు యువకులు కత్తిపోట్లకు(stab injury) గురయ్యారు. తమ వర్గానికి చెందిన వారిపై దాడి చేశారని... మరో వర్గం ఆందోళనకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ ఘటనా స్థలానికి చేరుకొని... ఆందోళనకారులను చెదరగొట్టారు.

గాయపడిన యువకులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారు జగిత్యాల పురాణి పేటకు చెందిన వొడ్నపల్లి మణి, నాగరాజు, మర్రిపెళ్లి ప్రభుగా గుర్తించారు. మళ్లీ గొడవలు చెలరేగకుండా... పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: Karthika masam 2021: కార్తీక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.