ETV Bharat / crime

Theft Live video: భువనగిరి ఆలయంలో హుండీ చోరీ

author img

By

Published : Feb 13, 2023, 12:53 PM IST

ఆలయంలో హుండీ చోరీ
ఆలయంలో హుండీ చోరీ

Theft at a temple in Yadadri Bhuvanagiri district: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీలో నగదు చోరీ చేశారు. ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.

Theft at a temple in Yadadri Bhuvanagiri district: దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు వినియోగించిన దొంగలు బరి తెగిస్తూనే ఉన్నారు. దొంగతనం చేసేందుకు ఏకంగా గుడినే ఎంచుకున్నారు వాళ్లు. ఎవరూ లేని సమయం చూసి ఎంచక్కా ఆలయంలోకి ప్రవేశించిన ఆ దొంగలు.. తాళాలు పగులగొట్టి గుడిలోని హుండీలో ఉన్న సొమ్మునంతా స్వాహాచేశారు. హుండీలో ఉన్న డబ్బునంతా ఒక సంచిలో వేసుకుని మూటలాగా కట్టుకుని దొచుకెళ్లారు.

ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయ హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హుండీలో సుమారు 40వేల నగదు ఉండొచ్చని పోలీసులు, పూజరులు భావిస్తున్నారు.

సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీని ఎవరు చేశారు.. స్థానికులా?.. లేక బయటి వ్యక్తులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఆలయంలో గతంలోనూ చోరీ జరిగినట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని భక్తులు కోరుతున్నారు.

రేణుక ఏల్లమ్మ ఆలయంలో హుండీ చోరీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.