ETV Bharat / crime

Meeseva Employee Murder Ramagundam : రోడ్డు పక్కన వ్యక్తి తల, చేతులు.. మొండెం ఎక్కడుందో?

author img

By

Published : Nov 27, 2021, 8:51 AM IST

Updated : Nov 27, 2021, 11:06 AM IST

Ramagundam Murder case, man's head on the road, kundanapalli news , కుందనపల్లి రోడ్డుపై వ్యక్తి తల, రామగుండం రహదారిపై వ్యక్తి తల
రోడ్డు పక్కన వ్యక్తి తల

08:40 November 27

Meeseva Employee Murder Ramagundam : రోడ్డు పక్కన వ్యక్తి తల, చేతులు.. మొండెం ఎక్కడుందో?

Meeseva Employee Murder Ramagundam : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లిలో రాజీవ్ రహదారి పక్కన ఓ వ్యక్తి తల, రెండు చేతులు కనిపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కాజిపల్లి గ్రామానికి చెందిన శంకర్​గా గుర్తించారు.

Ramagundam Murder today 2021 : పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి కాజిపల్లి గ్రామానికి చెందిన కాంపెల్లి శంకర్ రెండు రోజుల క్రితం అదృశ్యమై మల్యాల పల్లి రాజీవ్ రహదారి పక్కన దారుణ హత్యకు గురయ్యాడు. శంకర్ తల, చేతులు వేరువేరుగా పడి ఉండగా మొండెం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. సంఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మొండెం కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన ఎలా జరిగింది... దారుణ హత్యకు పాల్పడిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఉత్కంఠకు దారితీసింది..

Last Updated :Nov 27, 2021, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.