ETV Bharat / crime

డార్క్‌ నెట్ డీల్స్​కు చెక్.. టెక్నాలజీ సాయంతో ముకుతాడు వేస్తున్న నార్కోటిక్ వింగ్

author img

By

Published : Mar 1, 2022, 11:44 AM IST

Police about drugs Purchase through dark net : మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం... హైదరాబాద్ పోలీసులు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక నార్కోటిక్ నిఘా విభాగం ఏర్పాటు చేసిన పోలీసులు.. మాదక ద్రవ్యాల సరఫరాదారులు, వినియోగదారుల ఆట కట్టిస్తున్నారు. పోలీసు నిఘా పెరగడంతో డ్రగ్స్ కోసం డార్క్ నెట్​ను ఆశ్రయిస్తున్న వాళ్ల సంఖ్య... క్రమంగా పెరుగుతోంది. దీంతో నార్కోటిక్ నిఘా విభాగం పోలీసులు... డార్క్ నెట్ పైనా ప్రత్యేక దృష్టి సారించారు.

Police about drugs Purchase through dark net
డార్క్‌ నెట్​లో మాదక ద్రవ్యాల కొనుగోలు..

Police about drugs Purchase through dark net: స్మగ్లర్లు పోలీసులకంటే ఒకడుగు ముందే ఉంటున్నారు. మూడో కంటికి తెలియకుండా మాదక ద్రవ్యాల క్రయవిక్రయాలు చేస్తున్నారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. మాదక ద్రవ్యాల కొనుగోలు, అమ్మకాలు చేసే వాళ్లపైనా చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వాళ్లు.. ఎంతకైనా తెగిస్తున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో డార్క్ నెట్​ను ఆశ్రయిస్తున్నారు. ఎవరికీ తెలిసే అవకాశం లేకపోవడంతో.. డార్క్‌నెట్​లో మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నారు. కొరియర్ ద్వారా నేరుగా ఇంటి చిరునామాకు మాదక ద్రవ్యాలు చేరుకుంటున్నాయి. మాదక ద్రవ్యాలు వినియోగించే వాళ్లు... వాటిని సేవిస్తుండటంతో పాటు... అందులో కొంత మొత్తాన్ని అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

హెచ్​సీయూ స్టూడెంట్ అరెస్ట్

హైదరాబాద్ పోలీసులు మూడు రోజుల కిందట ఓ హెసీయూ విద్యార్థిని అరెస్ట్ చేయడంతో డార్క్ నెట్ వ్యవహారం బయటపడింది. పోలీసుల కంట పడకుండా సదరు విద్యార్థి డార్క్ నెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహా కొనుగోళ్లను కనిపెట్టడానికే... హైదరాబాద్ నార్కోటిక్ నిఘా విభాగం పోలీసులు డెకాయి ఆపరేషన్ చేశారు. డ్రగ్స్ కొనుగోలుదారుల మాదిరిగా.. డార్క్ నెట్​లో ప్రవేశించి మాదకద్రవ్యాల విక్రయదారులు, కొనుగోలుదారుల సమాచారం సేకరించారు. అందులో వచ్చిన వివరాల ఆధారంగా.. హెచ్​సీయూ విద్యార్థిని అరెస్ట్ చేశారు. అక్కడ పదుల సంఖ్యలో విద్యార్థులు డార్క్ నెట్ ద్వారా.. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

డార్క్ నెట్ వాడే గ్యాంగ్ దొరికింది. డార్క్ నెట్​పై నిఘా ఉంటుందని నేను బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే చెప్పాను. మేం రెండు నెలల్లో డార్క్ నెట్​ను సెర్చ్ చేశాం. అందులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలుసుకున్నాం. దీనిని ఉపయోగిస్తున్న ఒక విద్యార్థిని పట్టుకున్నాం. కొందరు దీనిపై ట్రైనింగ్ తీసుకున్నారు. డార్క్ నెట్​పై నిఘా పెట్టే సామర్థ్యం మెల్లమెల్లగా వస్తోంది.

-సి.వి.ఆనంద్, హైదరాబాద్ సీపీ

డార్క్ నెట్ ముసుగులో విక్రయాలు

1990 దశకంలో ఆర్మీ అధికారులు, వేగులు తమ రహస్య కార్యకలాపాలు ఇచ్చి పుచ్చుకునేందుకు డార్క్ నెట్​ను రూపొందించారు. ఇందులోని సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో కంటికి తెలియకుండా రూపొందించారు. ఇందులో సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ల ద్వారా తెలుసుకునే వీలుండదు. డార్క్ వెబ్ క్రమంగా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ డార్క్ వెబ్‌లో ఎన్ని వెబ్‌సైట్లు ఉంటాయి, ఎంత మంది డీలర్లు, కొనుగోలుదారులు ఉన్నారో తెలుసుకోవడం కష్టం. దీంతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వాళ్లందరూ... డార్క్ వెబ్​ను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయిన నైజీరియాకు చెందిన టోనీ... డార్క్ నెట్ ద్వారానే డ్రగ్స్ ను కొనుగోలు చేయడంతో పాటు.. విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో పోలీసులకు తెలిపాడు. టోనీ ద్వారా... డార్క్ నెట్​కు సంబంధించిన కొంత సమాచారం సేకరించారు.

పోలీసుల కొత్త ప్రయోగం

డార్క్ నెట్ మూలాలు మొత్తం తెలుసుకునేందుకు హైదరాబాద్ నార్కోటిక్ నిఘా విభాగం.. ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాధారణంగా ఏదైనా మోసం జరిగినప్పుడు పోలీసులు సంబంధిత సమాచారం సేకరించేందుకు నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తారు. అంతర్జాలాన్ని ఉపయోగించుకొని చేసే మోసాలను కనుక్కోవడానికి ఐపీ చిరునామాలు సేకరించి.. దాని ఆధారంగా నిందితులను గుర్తిస్తారు. కానీ డార్క్ నెట్​లో ఐపీ చిరునామాలు తెలిసే అవకాశమే లేదు. దీనికి విరుగుడుగా హైదరాబాద్ నార్కోటిక్ నిఘా విభాగం పోలీసులు.... కొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు. వినియోగదారులుగా ప్రవేశించి.. కొంత సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత దర్యాప్తు చేస్తున్నారు.

నార్కోటిక్ నిఘా

డార్క్ నెట్ కేంద్రంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోయిన విద్యార్థి ద్వారా... నార్కోటిక్ నిఘా విభాగం పోలీసులు.. మరింత సమాచారం సేకరిస్తున్నారు. డార్క్ నెట్​పై మరింత పట్టు పెంచుకొని.... నిందితుల ఆట కట్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

డార్క్‌ నెట్​లో మాదక ద్రవ్యాల కొనుగోలు..

ఇదీ చదవండి: Mother suicide with children: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.