ETV Bharat / crime

Palvancha Suicide Case: వనమా రాఘవకు బెయిల్ మంజూరు

author img

By

Published : Mar 10, 2022, 1:04 PM IST

Updated : Mar 10, 2022, 1:17 PM IST

TELANGANA High Court granted bail to Vanama Raghava
వనమా రాఘవకు బెయిల్ మంజూరు

13:02 March 10

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవకు బెయిల్

వనమా రాఘవకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నామని రామకృష్ణ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.

ఆ తర్వాత రాఘవ బాధితులు బయటకు వచ్చారు. అతని ఆగడాలపై చర్యలు తీసుకోవాలంటూ విపక్ష నేతలు ఆందోళనలు నిర్వహించారు. రాఘవపై వచ్చిన ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తూ తెరాస నిర్ణయం తీసుకుంది. అతని లొంగుబాటు వ్యవహారం రకరకాల మలుపులు తిరిగింది. చివరకు రాఘవను పాల్వంచ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. ఆ కేసులో రాఘవకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.

ఇవీచూడండి:

Last Updated :Mar 10, 2022, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.