బైక్ లిఫ్ట్‌ ఘటన.. భర్తను చంపేందుకు భార్య మాములు ప్లాన్స్ వేయలేదుగా..!!

author img

By

Published : Sep 21, 2022, 7:54 PM IST

Updated : Sep 21, 2022, 11:00 PM IST

Strainger kills biker after giving lift in khammam case update

Khammam bike lift incident : మూడు ముడుల బంధం ముళ్ల బంధమవుతోంది. ఏడడుగుల అనుబంధం అల్లరిపాలవుతోంది. తాళిని ఎగతాళి చేస్తూ... నాతిచరామిని నవ్వులపాలు చేస్తూ... విష బంధంలో చిక్కుకుని నిండు జీవితాలు విషాదాంతంలోకి నెట్టుకుంటున్నారు. అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నాడని... భర్తను అంతమొందించేందుకు ఓ భార్య రాసిన మరణశాసనం... సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది.

ఖమ్మం బైక్ లిఫ్ట్ మిస్టరీ.. వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలివే!

Khammam bike lift incident: ఆమెది పచ్చని సంసారం. భర్త తాపీ మేస్త్రీ. ఆమె మహిళలను కూలీకి తీసుకెళ్లే ముఠామేస్త్రీ. ఇద్దరు కుమార్తెకు పెళ్లిళ్లు చేసిన దంపతుల జీవితం.. ప్రశాంతంగా సాగుతోంది. ఇంతలో భార్యను అనైతిక బంధం అల్లుకుంది. తాళిని ఎగతాళి చేసి.. నాతిచరామిని నవ్వులపాలు చేస్తూ.. విషబంధంలో చిక్కుకుంది. అంతటితో ఆగలేదు.అనైతిక బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భార్యే భర్త మరణశాసనం రాసింది. సభ్యసమాజం తలదించుకునేలా భర్తపైనే విషప్రయోగం చేయించి అంతమొందించింది. మళ్లీ ఏమీ తెలియనట్టు కట్టుకున్న భర్త కానరాని లోకానికి వెళ్లాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. మూడు ముళ్ల బంధాన్ని ముళ్లబంధం చేసి.. ఏడడుగుల అనుబంధాన్ని అభాసుపాలు చేస్తూ.. చివరకు నూరేళ్ల దాంపత్య జీవితాన్ని విషాదంలోకి నెట్టుకుంది. చివరకు హత్యకు అసలు సూత్రదారిగా పోలీసులకు చిక్కింది. ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఇంజక్షన్ గుచ్చి జమాల్ సాహెబ్‌ను హత్య కోణంలో అసలు కథ.

పోలీసుల విచారణలో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఇంజక్షన్ గుచ్చి జమాల్ సాహెబ్‌ను అంతమొందించిన హత్య కేసులో ప్రధాన సూత్రదారి మృతుడి భార్యేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీ.. పథక రచన చేసినట్లు పోలీసులు ఓ నిర్దరణకు వచ్చారు. భార్య ఇచ్చిన సమాచారంతోనే ఈనెల 19న జమాల్ సాహెబ్‌కు ఇంజక్షన్‌ ఇచ్చారని మీడియా సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి పోలీసులు తెలిపారు. ఐదుగురు కలిసి జమాల్‌ సాహెబ్‌ హత్యకు కుట్ర చేశారని వెల్లడించారు. ప్లాన్‌ ప్రకారమే జమాల్‌ సాహెబ్‌ను హత్య చేశారన్నారు. ఏ1 మోహన్‌, ఏ2 బండి వెంకన్న, ఏ3 వెంకటేశ్‌, ఏ4 ఇమామ్‌బీ, ఏ5 యశ్వంత్‌, ఏ6 వంశీలుగా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజులు కేసు ఛేదనలో కష్టపడిన పోలీసు సిబ్బందికి ఏసీపీ అభినందనలు తెలిపారు.

అసలేం జరిగిందంటే? చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ భార్య ఇమామ్‌ బీతో అదే మండలం నామవరానికి చెందిన మోహన్‌ రావుతో పరిచయం ఏర్పడింది. ఇమామ్‌ బీ కూలీల మేస్త్రీ కాగా.. మోహన్‌రావు ఆటో డ్రైవర్‌. కూలీలను తీసుకెళ్లేందుకు ఇమామ్‌ బీ తరచూ మోహన్‌రావుతో టచ్‌లో ఉండేది. ఈ క్రమంలో వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఒకరోజు ఇంట్లో ఇమామ్‌బీ.. మోహన్‌రావుతో ఉండగా జమాల్‌ సాహెబ్‌ చూసి భార్యపై చేయి చేసుకున్నాడు.

దీంతో తమ వివాహేతర సంబంధం భర్తకు తెలిసినప్పటి నుంచి అతడిని అంతం చేయాలని వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మోహన్‌రావు నామవరం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్నను సంప్రదించాడు. మనిషిని చంపించే ఇంజెక్షన్‌ ఇప్పించాలని రూ.5వేలు చెల్లించాడు. బండి వెంకన్న తన స్నేహితుడైన యశ్వంత్‌ను సంప్రదించి ఇంజెక్షన్‌ కావాలని అడిగాడు. యశ్వంత్‌ తన మిత్రుడు సాంబశివరావుకు చెప్పి అతని దగ్గర నుంచి రెండు నియో వాక్‌ ఇంజెక్షన్లు తెప్పించుకున్నాడు. ఆ ఇంజెక్షన్‌ను మరో ఆటో డ్రైవర్‌ వెంకటేశ్‌ ద్వారా ఇమామ్‌ బీకి పంపించాడు.

అయితే, జమాల్‌ను చంపేందుకు ఇమామ్‌ బీ విఫలయత్నం చేయడంతో మళ్లీ ఆ ఇంజెక్షన్‌ను వెంకటేశ్‌ ద్వారా మోహన్‌రావుకే పంపింది. ఈ నెల 19న ఇమామ్‌ బీ తన భర్త ఏపీలోని గండ్రాయి (కూతురు ఇంటికి) వస్తున్నాడని మోహన్‌రావుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో మోహన్‌రావు, బండి వెంకన్న, వెంకటేశ్‌లు రెండు ద్విచక్రవాహనాలపై వల్లభి వెళ్లారు. బండి వెంకన్న అక్కడ లిఫ్టు అడిగి ఇంజెక్షన్‌ ఇచ్చి పారిపోయారు. ఇంజెక్షన్‌ ప్రభావంతో వల్లభిలోని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు జమాల్‌ మృతి చెందాడు. నిందితుల నుంచి మొబైల్‌ ఫోన్లు, రెండు బైక్‌లు, వాడిన ఇంజెక్షన్‌ ఒకటి, వాడని ఇంజెక్షన్‌ మరొకటి, ఒక షర్ట్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అయితే, జమాల్‌ కన్నా ముందు గుంజి మైసయ్య అనే వ్యక్తి బండిపై రాగా.. అదే రంగులో ఉన్న షర్ట్‌ వేసుకోవడంతో అతడిని ఆపారని.. ఆ తర్వాత అతడితో మాట్లాడి.. జమాల్‌ కాదని నిర్ధారించుకున్నాక అతడిని వదిలిపెట్టారని వెల్లడించారు.

పోలీసులపై ప్రశంసల జల్లు ఈ నలుగురితోపాటు విష రసాయనం విక్రయించిన ఖమ్మంకు చెందిన ఓ మందుల దుకాణం వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎనస్తీషియాకు ఇచ్చే రసాయనం అధిక మోతాదులో ఇవ్వడం, అది కూడా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంచలనం రేపడంతో పాటు అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ హత్య కేసును 48 గంటల్లోనే చేధించిన పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఐదు కుటుంబాలకు తీరని వేదన.. ఒక్క హత్య ఘటన మొత్తం ఐదు కుటంబాలకు తీరని వేదన మిగిలించింది. అనైతిక బంధం మోజులో భర్తను పోగొట్టుకున్న భార్య దిక్కులేనిదైంది. దీంతో పాటు కటకటాల పాలైంది. తనకంటూ కుటుంబం భార్యా పిల్లలతో హాయిగా ఉన్న మరో నలుగురి కుటుంబాలకు కష్టాలు తప్పడం లేదు. ప్రియురాలి మోజులో పడి మోహన్ రావు ఈ హత్య కేసులో ప్రధాన పాత్రదారిగా మారగా.. అసలు సంబంధంలేని డ్రైవర్ వెంకటేశ్, ఆర్ఎంపీ వైద్యుడు వెంకట్, మత్తు మందు విక్రయించిన మరో వ్యక్తి కటకటాల పాలు కావాల్సి వస్తుంది.

Last Updated :Sep 21, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.