కొండాపూర్​లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.. 15 రోజుల క్రితమే ఉద్యోగం

author img

By

Published : Nov 21, 2022, 8:25 PM IST

Suicide
Suicide ()

Software Employee Commits Suicide: ఓ యువకుడు పదిరోజుల క్రితమే సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని నగరానికి వచ్చాడు. బంధువుల ఇంట్లో ఉంటూ విధులకు వెళుతున్నాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండాపూర్​లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Software Employee Commits Suicide: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని కొండాపూర్​లో చోటుచేసుకుంది. పోలీసుులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన అక్షయ్ కుమార్ అనే యువకుడు పదిహేను రోజుల క్రితమే నగరంలోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్​కు వచ్చాడు. కొండాపూర్​లోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచే విధులకు హాజరయ్యేవాడు.

అక్షయ్​కుమార్ తండ్రి దేవెేందర్ రెవెన్యూ విభాగంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అంతకుముందు ఆయన మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పీఏగా పని చేశాడు. అలాగే సొంత జిల్లాలో అక్షయ్ కుమార్​పై పలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అదేవిధంగా యువకుడు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లు ఇప్పిస్తామని పలువురి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్​కు వచ్చిన అక్షయ్ కుమార్ ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.