ETV Bharat / crime

కోమట్​పల్లి అడవిలో జింకల వేట.. పోలీసుల ఛేజింగ్​.. వేటగాళ్ల అరెస్ట్​..

author img

By

Published : May 8, 2022, 8:53 AM IST

Hunters
Hunters

కోమట్​పల్లి అడవిలో జింకల వేట.. పోలీసుల ఛేజింగ్​.. వేటగాళ్ల అరెస్ట్​..

Hunters: నిషేదిత ఆయుధాలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి జింకలను వేటాడిన 6 మంది వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆయుధాలు, జింకల కళేబరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్​కి తరలించారు.

Hunters: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం కోమట్​పల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో జింకలను వేటాడిన 6 మంది వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. తప్పు చేసిన వారు పోలీసుల నుంచి తప్పించుకోలేరని ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లింగంపేటలో వన్యప్రాణుల వేటగాళ్లను పట్టుకోవడంలో ప్రత్యేక చొరవ కనబర్చిన ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్సై శంకర్, కానిస్టేబుళ్లు శంకర్, రాంమోహన్​, హోంగార్డు వసంతులను అభినందించారు. వారికి త్వరలోనే రివార్డులు అందజేస్తామన్నారు. వన్యప్రాణుల వేటలో పట్టుబడిన నిందితుల చరిత్రపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరూ సిద్ధిపేట, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వధించినట్లు సమాచారం.

నిందితులు ఎలా దొరికారంటే.. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ఐదుగురు వేటగాళ్లు లింగంపేట్ మండలం కోమట్​పల్లి అటవీ ప్రాంతంలో జింకలను వేటాడారు. అటుగా పోలీసులు పెట్రోలింగ్​కు వెళ్లగా... రోడ్డుపై ఒక వాహనం నిలిపి ఉంది. ఎవరనీ ప్రశ్నించడంతో వాహనాన్ని వేటగాళ్లు వేగంగా తీసుకెళ్లిపోయారు. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. కోమట్​పల్లి నుంచి ఐలపూర్ మార్గంలో నిందితుల వాహనం ఆగిపోయింది. ఆయిల్ ఛాంబర్ పగిలిపోయి వాహనం ముందుకు కదల్లేదు. దీంతో వాహనంలో ఉన్న ఐదుగురు వాహనం వదిలేసి పరారయ్యారు. అందులో ఒకరు రైఫిల్ పట్టుకుని పొలాల్లో దాక్కున్నాడు. పోలీసులు ధైర్యం చేసి నిందితుడిని పట్టుకున్నారు. అతని ద్వారా మిగతా నలుగురినీ అరెస్టు చేశారు. రెండు కార్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని లింగంపేట్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. హైదరాబాద్ నుంచి వన్యప్రాణులు వేటాడేందుకు వచ్చినట్లు వారు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:బట్టలిస్తామని చెప్పి పిల్లాన్ని ఎత్తుకెళ్లిన మహిళలు.. వీడియో వైరల్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.