fake notes seized : గోల్కొండలో రూ.2కోట్ల నకిలీ నోట్లు పట్టివేత

author img

By

Published : Nov 9, 2021, 5:05 AM IST

fake notes seized

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. సుమారు రూ. రెండు కోట్లు కరెన్సీ నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు ( fake notes seized ).

హైదరాబాద్​ గోల్కొండ ఠాణా పరిధి 7టూమ్స్‌ బస్‌ స్టాండ్‌ సమీపంలో రూ.2కోట్లు కరెన్సీ నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్ల గుట్టు రట్టయింది.

వారి బ్యాగులోని రూ.500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మాటు వేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: FAKE NOTES: యూట్యూబ్‌ చూసి.. దొంగనోట్లు తయారీ చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.