ETV Bharat / crime

మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్​

author img

By

Published : Apr 20, 2022, 7:03 PM IST

Kodada Rape Case: సూర్యాపేట జిల్లా కోదాడ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీ 376తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

kodada women rape case
kodada women rape case

Kodada Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా కోదాడ యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1 సాయిరామ్ రెడ్డి, ఏ2 గౌసిద్ధిన్ పాషాలపై ఐపీసీ 376తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కోదాడ పట్టణ సీఐ నరసింహారావు తెలిపారు. కోదాడ పట్టణ శివారులో ఓ యువతిని బంధించి శీతలపానియంలో మత్తుమందు ఇచ్చి మూడు రోజుల పాటు నిందితులు సాయిరామ్ రెడ్డి, గౌసుద్ధిన్ పాషా అత్యాచారం చేసినట్లు చెప్పారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఏం జరిగిందంటే: ఓ యువతి(20) తల్లితో కలిసి కోదాడ పట్టణంలో నివసిస్తోంది. తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం తల్లి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతిని పట్టణానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషా, అతని స్నేహితుడు సాయిరామ్ రెడ్డి బలవంతంగా ఆటో ఎక్కించుకుని పట్టణ శివారులోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి బంధించారు. శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇవ్వడంతో స్పృహ కోల్పోయిన యువతిపై నిందితులిద్దరూ మూడురోజుల పాటు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ప్రతిఘటించడంతో చిత్రహింసలకు గురిచేసి గాయపరిచారు. బాధితురాలిని బంధించిన ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు ఆదివారం పొద్దుపోయాక ఆ ఇంట్లో జరుగుతున్న తంతును గుర్తించారు. బాలిక తల్లికి సమాచారం అందించారు. ఆమె బంధువులతో వెళ్లి కుమార్తెను రక్షించి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేట జిల్లా వైద్యశాలకు తరలించారు.

నిందితుల్లో ఒకరైన మహమ్మద్ గౌస్ పాషా కోదాడ మున్సిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్ ఫాతిమా కుమారుడని, అధికార పార్టీ నాయకులు కావడంతో నిందితులు తమను బెదిరిస్తున్నారని బాధితురాలి తల్లి సోమవారం పోలీసులు, మీడియా ప్రతినిధులకు తెలిపారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి : కూల్​డ్రింక్స్​లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం..

పెళ్లి పేరుతో మోసం.. తల్లీకూతుళ్లపై గ్యాంగ్​ రేప్.. 2 నెలల చిన్నారిపైనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.