ETV Bharat / crime

ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు... మామూలోడు కాదుగా!

author img

By

Published : Nov 10, 2022, 1:03 PM IST

సులువుగా డబ్బు సంపాదించాలనుకున్న ఓ వ్యక్తి ఏవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు చేపట్టారు. కానీ గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుపడ్డ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ వ్యక్తి ఇంటిపై దాడిచేసి అతని వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Ganza Smuggler arrested
Ganza Smuggler arrested

కొందరు ఆడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు వివిధ రకాల నేరాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా ఖాళీ స్థలంలో గంజాయి మొక్కలను పెంచుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నందుల పేటలో ఖాళీ స్థలంలో గోపి అనే వ్యక్తి గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఇటీవల తెనాలి డీఎస్పీ స్రవంతి రాయి ఆధ్వర్యంలో వరుసగా గంజాయి అమ్మే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటూ వచ్చారు.

గోపి అనే వ్యక్తి గంజాయి చెట్లు పెంచుతున్నట్లు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు.. మందులు పేటలో బుధవారం రాత్రి స్థానిక పోలీసులు, సెబ్​ అధికారులు దాడి చేశారు. ఈ మేరకు గోపిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెనాలిలో ఇంకా పలు ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం ఉందని.. అలాంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇంట్లోనే గంజాయి సాగు ఎక్కడంటే

ఇవీ చదవండి: డిగ్రీకి లక్ష, బీటెక్​కు లక్షన్నర... ఏదైనా క్షణాల్లో రెడీ... అసలేంటీ కథ?

మరో నిర్భయ తరహా దారుణం.. జననాంగాల్లో పైపు చొప్పించి హత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.