ETV Bharat / crime

chain snatching: లిఫ్ట్ అడుగుతారు.. గొలుసు కొట్టేస్తారు!

author img

By

Published : Nov 20, 2021, 10:18 AM IST

లిఫ్టు అడిగి వాహనదారుల నుంచి బంగారు నగలు, ల్యాప్‌టాప్‌లను లాక్కొని(chain snatching) ఉడాయిస్తున్న హిజ్రాతో పాటు ఆమె సహచరుడిని అరెస్టు చేశారు. ఈనెల 12న కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి... అతడి గొలుసు, ల్యాప్​టాప్​తో పరారైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

chain snatching, transgender arrest
చైన్ స్నాచింగ్, ట్రాన్స్​జెండర్ అరెస్ట్

వాహనదారులను లిఫ్ట్‌ అడుగుతారు. మాటల్లో పెట్టి వారి మెడలోని బంగారు గొలుసు లాక్కొని(chain snatching) చెక్కేస్తారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్‌తో పాటు మరో వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, లాప్‌టాప్‌, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరుకు చెందిన అంజుమ్‌ 8ఏళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా(transgender woman arrested) మారింది. హైదరాబాద్‌కు తన అనుచరుడు బస్వరాజ్‌తో కలిసి చేరుకుంది. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసింది.

ఈజీ మనీ కోసం..

సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన అంజుమ్‌... వాహనదారులను లిఫ్ట్‌ అడిగేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా లిఫ్ట్‌ ఇస్తే చాలు... మాటల్లో పెట్టి వాహనదారుల మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యేవారని వెల్లడించారు. ఈ నెల 12న రాత్రి ప్యారడైజ్‌ సర్కిల్‌లో కారులో వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్‌ అడిగిందని... కారులో ఎక్కిన తర్వాత ఆ వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడంతో... వాహనదారుడు అంజుమ్‌ను కారు దింపేశాడని తెలిపారు. ఈ క్రమంలో అతని మెడలోని బంగారు గొలుసు, ల్యాప్‌టాప్‌ లాక్కొని పరారైందని వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

బేగంపేటలో మరో ద్విచక్రవాహనదారుడిని లిఫ్టు అడిగి బంగారు గొలుసును దొంగిలించింది. గురువారం లాడ్జిలో ఉన్న అంజుమ్‌, బసవరాజును అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవలె చైన్ స్నాచింగ్ ఘటన

ఇలాంటి ఘటన హైదరాబాద్​లో ఇటీవలె జరిగింది. హైదరాబాద్​లో పోలీస్ కానిస్టేబుల్​ బంగారు గొలుసును ఓ మహిళ కొట్టేసింది. అటుగా వస్తున్న పోలీస్ కానిస్టేబుల్​ను లిఫ్ట్ అడిగింది ఓ మహిళ. ద్విచక్రవాహనం మీద వస్తున్న కానిస్టేబుల్ ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. తను వెళ్లాల్సింది అక్కడికే అంటూ పంజాగుట్ట జంక్షన్​లో దిగిపోయింది. ఈలోపే బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ మెడలోని గొలుసు మాయమైంది. ఇంతకీ ఏం జరిగింది?

లిఫ్ట్ అడిగి.. చైన్​తో పరార్

కానిస్టేబుల్ మెడలో గొలుసు కొట్టేసింది ఓ మహిళ. తన ద్విచక్రవాహనంపై కానిస్టేబుల్ మహిళకు లిఫ్ట్ ఇవ్వగా... పంజాగుట్ట జంక్షన్‌లో ఆ కిలాడీ మహిళ దిగిపోయింది. అనంతరం కానిస్టేబుల్ మెడలోని బంగారు గొలుసు మాయమైంది. బైక్ మీద కూర్చున్న సమయంలోని చైన్​ను మాయం చేసిందని కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి దగ్గర్నుంచి తీసుకున్న ఓ ట్రాన్స్​జెండర్(malda news)... డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్ చేశారు. చివరకు, హిజ్రా (eunuch blessing) ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బంగాల్​లో (West Bengal news) జరిగిందీ దారుణం. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: కనిపించకుండా పోయి హిజ్రాగా మారాడు.. ఆ తర్వాత..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.