ETV Bharat / crime

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

author img

By

Published : Apr 24, 2021, 4:56 PM IST

కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చాడో భర్త. కుటుంబాల తగాదాల కారణంగా వివేకం కోల్పోయి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ ఆ ఇల్లాలు ప్రాణాలు వదిలింది. ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరులోని సవకతోటలో ఈ ఘటన జరిగింది.

Husbund killed Wife
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. శ్రీహరి అనే వ్యక్తి తన భార్య సుజాతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వేములపాలెం సమీపంలోని సవకతోటలో ఈ హత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆమెను హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: కరెంట్ తీగలు తగిలి గడ్డి వ్యాను దగ్ధం.. డ్రైవర్ సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.