ETV Bharat / crime

నైజీరియాకు చెందిన డ్రగ్​ పెడ్లర్​ అరెస్ట్.. 5 గ్రాముల కొకైన్​ స్వాధీనం

author img

By

Published : Jan 25, 2023, 7:09 PM IST

Drug peddler arrested: సైబర్ మెసాలు, డ్రగ్స్ సరఫరాలో దేశంలో ఎంతో ప్రముఖంగా వినిపించే పేరు నైజీరియన్లు. చదువు కోసమని, వ్యాపారం సాకుతో దేశంలోకి వచ్చే వీరు.. తరువాత చేసేది ఆన్​లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల విక్రయం. పలుమార్లు జైలుకు వెళ్లి వస్తున్నా.. వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇలాగే స్టూడెంట్ వీసాపై వచ్చిన ఓ నైజీరియన్ డ్రగ్స్ విక్రయిస్తూ హైదరాబాద్ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్​కు దొరికిపోయాడు.

arrested a drug peddler from Nigeria
నైజీరియాకు చెందిన మాదక ద్రవ్యాల వ్యాపారిని అరెస్ట్ చేసినన పోలీసులు పోలీసులు

Drug peddler arrested: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారి అక్రమంగా డ్రగ్స్​ సరఫరా చేస్తుండగా హైదరాబాద్​ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నైజీరియా దేశానికి చెందిన ఇమ్మాన్యుయేల్​ ఒసాండు 2016లో స్టూడెంట్​ వీసాపై భారతదేశానికి వచ్చాడు. అప్పటినుంచి ముంబైలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు ఈజీ మనీ కోసం అలవాటు పడి కొకైన్​ ఇతరులకు సరఫరా చేసేవాడు. గతంలో నిందితుడ్ని ఎన్​డీపీఎస్​ చట్టం కింద అరెస్టు చేసి గోరేగావ్​ పోలీస్​ స్టేషన్​లో పెట్టారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత లెవెల్​ అరమ్​ అనే డ్రగ్​ డీలర్​ నుంచి డ్రగ్​ కొనుగోలు చేసి స్థానిక వ్యాపారులకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి డ్రగ్స్ సరఫరా చేయడానికి హైదరాబాద్​లోని బహుదూర్​ పురాకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్​ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్​ అధికారులు అతనిపై నిఘా ఉంచారు. నిందితుడు డీలర్​కి డ్రగ్​ అమ్ముతుండగా అధికారులు బహుదూర్​ పురా పోలీసుల సహాయంతో అతడ్ని పట్టుకున్నారు.

Emmanuel Osandu
ఇమ్మాన్యుయేల్​ ఒసాండు

నిందితుడి నుంచి 5 గ్రాముల కొకైన్​తో పాటు సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విదేశీయులు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు.

ఇలాంటి కేసులోనే అరెస్ట్ అయిన మరో నైజీరియన్​: ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం ఇంకో నైజీరియన్​ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసు వివరాలు.. ధూల్​పేటలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌ను.. హయత్‌నగర్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ.17.80లక్షల విలువైన 178 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రవీణ్ వెల్లడించారు. నిందితుడు 2015లో చదువు కోసం దేశానికి వచ్చాడని తెలిపారు. వీసా పరిమితి ముగిసినా.. అక్రమంగా భారత్​లోనే ఉంటున్నాడని చెప్పారు.

నిందితుడి వద్ద రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్టు సీఐ ప్రవీణ్ తెలిపారు. అసలు పాస్‌పోర్టు నైజీరియాకు చెందినది కాగా.. నకిలీ పాస్‌పోర్టు ఘనా దేశానికి చెందిందని వివరించారు. నిందితుడు మాదకద్రవ్యాలను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్టు చెప్పారు. అతని వద్ద నుంచి రూ.17.80లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుడిని విచారించగా.. సరైన సమాధానాలు చెప్పడం లేదని సీఐ ప్రవీణ్ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.