ETV Bharat / crime

Nampally Girl Missing Case : నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం..

author img

By

Published : Mar 2, 2022, 3:48 PM IST

Updated : Mar 2, 2022, 4:12 PM IST

Nampally Girl Missing Case, baby missing
నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

Nampally Girl Missing Case : హైదరాబాద్‌ నిలోఫర్ ఆస్పత్రి నుంచి చిన్నారి అపహరణ కేసు సుఖాంతమైంది. నాంపల్లి పోలీసులు గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితురాలిని పట్టుకుని... చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారిని సురక్షితంగా అప్పగించినందుకు పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

Nampally Girl Missing Case : హైదరాబాద్​ నిలోఫర్​లో కిడ్నాప్​కు గురైన చిన్నారి కథ సుఖాంతం అయింది. గంటల వ్యవధిలోనే ఈ కేసును నాంపల్లి పోలీసులు ఛేదించారు. కల్లు కాంపౌండ్​లో ఉన్న నిందితురాలిని అదుపులోకి తీసుకొని... చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

ఏం జరిగింది?

Baby Missing Case : చిన్నారి కిడ్నాప్ కేసును నాంపల్లి పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. రంగారెడ్డి జిల్లా బొబ్బిలిగం గ్రామానికి చెందిన మాధవి తన కుమార్తె యువికతో కలిసి నీలోఫర్ ఆస్పత్రికి బుధవారం వచ్చింది. వైద్య పరీక్షలు చేయించుకొని.. రిపోర్టుల కోసం వెళ్లగా... కుమార్తె కనిపించకుండా పోయింది. చిన్నారి అదృశ్యంతో ఆందోళనకు గురైన తల్లి... వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.

ఎలా పట్టుకున్నారు?

Missing Case updates: సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాపను గంటల వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళ... హాస్పిటల్ ముందు ఆటో ఎక్కడాన్ని గుర్తించామని... ఆటో నంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్​ను మాసాబ్ ట్యాంక్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని విచారించగా... పాపను కిడ్నాప్ చేసిన శ్రీదేవి అనే మహిళను పట్టుకున్నామన్నారు. హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటి కుంట కల్లు కాంపౌండ్ వద్ద అదుపులోకి తీసుకొని... పాపను తల్లి వద్దకు చేర్చినట్లు వివరించారు.

పాప తల్లి నిలోఫర్ ఆస్పత్రి వద్ద కూర్చుని ఏడుస్తుంటే... డ్యూటీలో ఉన్న మా సిబ్బంది పోయి అడిగారు. పాప కనిపించడం లేదని చెప్తే... మిస్సింగ్ అని కేసు నమోదు చేశాం. వెంటనే దర్యాప్తు ప్రారంభించాం. సీసీ ఫుటేజీ ఆధారంగా టీమ్ అంతా కలిసి గాలించాం. ఆటో డ్రైవర్​ను పట్టుకొని... అత్తాపూర్ కల్లు కాంపౌండ్ దగ్గర నిందితురాలిని పట్టుకున్నాం. చిన్నారిని గంటల వ్యవధిలోనే తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాం. సీసీ కెమెరాల వల్లే ఇంత త్వరగా పట్టుకున్నాం. కాబట్టి సీసీ కెమెరాలను అందరూ పెట్టుకోవాలి. ఇళ్లలోనూ పెట్టుకుంటే మరీ మంచింది.

-వేణుగోపాల్ రెడ్డి, సైఫాబాద్ ఏసీపీ

పోలీసులకు కృతజ్ఞతలు

చిన్నారిని సురక్షితంగా తన వద్దకు చేర్చడంతో పాప తల్లి మాధవి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. చిన్నారి క్షేమంగా తిరిగిరావడంపై సంతోషం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసిన మహిళ శ్రీదేవి వద్ద నుంచి పాపకు చెందిన వెండి ఆభరణాలు, కల్లు ప్యాకెట్లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: Nirmal Minor Rape Case : బాలికపై అత్యాచారం ఘటనలో ముగ్గురు అరెస్టు

Last Updated :Mar 2, 2022, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.