ETV Bharat / crime

కట్నం వేధింపులు తాళలేక కుమార్తెతో కలిసి ఆత్మహత్య

author img

By

Published : Apr 3, 2021, 12:05 PM IST

Updated : Apr 3, 2021, 12:34 PM IST

mother and child commits suicide,dowry issues
కట్నవేధింపులు తాళలేక కుమార్తెతో కలిసి ఆత్మహత్య

కట్న దాహానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. ఎంత చదువుకున్నా.. ఎన్ని చట్టాలు వచ్చినా.. కట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు. అత్తింటి కట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత.. తన కుమార్తెతో కలిసి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కరీంనగర్​లో చోటుచేసుకుంది.

అత్తింటి వారి నుంచి అదనపు కట్నం వేధింపులు తీవ్రతరం కావడంతో ఆరు నెలల కుమార్తె సహా ఓ వివాహిత నీటిసంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్​లో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

కరీంనగర్ సిక్కువాడిలో నివాసముంటున్న పాత నాగార్జునకు, వేములవాడకు చెందిన మౌనిక(30)తో 2018లో పెద్దలు నిర్ణయించిన వివాహం జరిగింది. హైదరాబాద్​లోని ఓ సాప్​వేర్​ సంస్థలో నాగార్జున ఉద్యోగం చేస్తుండటం వల్ల మౌనికను సైతం తన వెంట హైదరాబాద్​కు తీసుకెళ్లాడు. కరోనా కారణంగా ఏడాది క్రితం కరీంనగర్​కు వచ్చిన నాగార్జున దంపతులు స్థానిక సిక్కువాడిలో కిరాణ దుకాణం నడిపిస్తున్నారు. ఆరు నెలల కింద కుమార్తె సుదీక్షకు జన్మనిచ్చిన మౌనికను అదనపు కట్నం తేవాలంటూ.. భర్తతో పాటు అత్తింటి వారి నుంచి వేధింపులు తీవ్రతరమయ్యాయి.

దీనితో తీవ్ర మానసిక వేదనకు గురైన మౌనిక తన ఆరు నెలల కుమార్తె సుదీక్షతో సహా భవనం కింది భాగంలో ఉన్న నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కుమార్తె మృతి చెందినట్లు మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బతుకు భారమై.. రైతు ఆత్మహత్య

Last Updated :Apr 3, 2021, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.