ETV Bharat / crime

Maripeda si case: 'రిమాండ్​కు ఎస్సై.. నిందితులెవరైనా సరే చర్యలు తప్పవు'

author img

By

Published : Aug 4, 2021, 7:09 PM IST

Maripeda si case
మరిపెడ ఎస్సై కేసు

మహిళా శిక్షణ ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్​ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్​లో మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణల మీద ఎస్సై శ్రీనివాస రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. అతనిపై ఫిర్యాదు మేరకు అతనిపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. పై అధికారులకు నివేదిక పంపించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా విజిలెన్స్​ కమిటీ వేస్తామని చెప్పారు. తద్వారా పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

మంగళవారం.. ఎస్సై శ్రీనివాస రెడ్డి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ.. మహిళా శిక్షణ ఎస్సై పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సైని సస్పెండ్​ చేస్తూ నార్త్​జోన్​ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిన్న ఉదయం అక్రమంగా రవాణా చేస్తున్న నల్లబెల్లాన్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన శ్రీనివాస్​ రెడ్డి.. ఉన్నతాధికారుల నుంచి రివార్డులు, సత్కారం పొందారు. అలా జరిగిన కొద్దిగంటల్లోనే అతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదుతో అరెస్టై సస్పెండ్ అయ్యారు.

ఇవీ చదవండి: Maripeda SI: ట్రైనీ మహిళా ఎస్సైపై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారయత్నం.. అసలేం జరిగిందంటే?

Revanth reddy: 'ఆదివాసీలకు మద్దతుగా..సెప్టెంబరు​లో తెలంగాణకు రాహుల్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.