Attack: భాజపా కౌన్సిలర్ సోదరుడిపై తెరాస కార్యకర్త దాడి.. పరిస్థితి విషమం!

author img

By

Published : Jul 31, 2021, 12:26 PM IST

Attack
కత్తితో దాడి ()

ఓ యువకుడిపై అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు... రాజకీయ నేపథ్యంలో దాడి జరిగిందని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నిర్మల్​ జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. బుధవార్​పేట్​ కాలనీకి చెందిన బొమ్మెడ అనీల్​పై... అదే కాలనీకి చెందిన శ్రీకాంత్​.. శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం అయిన అనిల్​ను... కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనిల్​ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కక్షలేనా?

రాజకీయ కక్షతోనే తన బావమరిదిపై దాడి చేశారని... భాజపా కౌన్సిలర్​ భర్త సైండ్ల శ్రీధర్ ఆరోపించారు. శ్రీకాంత్ తెరాసకు చెందిన వాడని... రాజకీయ కక్షతోనే అనిల్​పై దాడి చేశారని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితుడి బావ చెప్పినట్లు ఈ ఘటన వెనుక రాజకీయ హస్తం ఉండొచ్చు, లేదా ఇద్దరి మధ్య విభేదాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి... ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: అయ్యో పాపం... అడ్డొస్తున్నాడని పసివాడిని అమ్మమ్మే చంపేసింది!

భర్తను చంపి.. సాధారణ మరణంగా సృష్టించబోయి....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.