ETV Bharat / crime

Lorry Accident Live Video : కంటైనర్​ బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : May 16, 2022, 7:41 PM IST

Lorry Accident At Uravakonda
Lorry Accident At Uravakonda

Lorry Accident At Uravakonda : ఇద్దరు వ్యక్తులు ఫంక్షన్​ హాలులో నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. తేరుకుని చూసేసరికి ఓ వాహనం తమవైపు దూసుకొస్తోంది. అంతే ఒక్క ఉదుటున పరుగులు తీశారు. అయితే ప్రహరీ గోడ అడ్డు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉరవకొండ శివారులో జరగగా.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Lorry Accident At Uravakonda : ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులోని జాతీయ రహదారి పక్కనున్న సత్యం కల్యాణ మండపంలోకి కంటైనర్​ దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆదివారం రాత్రి ఉరవకొండ వైపు నుంచి వస్తున్న కంటైనర్​ టైర్ పంచరై.. అక్కడే ఉన్న డివైడర్ పైనుంచి కల్యాణ మండపంలోకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా.. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాలు, కళ్యాణ మండపం గోడ ధ్వంసమైంది. కళ్యాణమండపం యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కంటైనర్​ బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.