ETV Bharat / crime

Lorry fire in Yadadri district : లారీ దగ్ధం.. పూర్తిగా కాలిపోయిన జిప్సం

author img

By

Published : Nov 23, 2021, 10:48 AM IST

lorry fire, lorry fire in mulkalapally, lorry fire in yadadri, ముల్కలపల్లిలో లారీ దగ్ధం
ముల్కలపల్లిలో లారీ దగ్ధం

Lorry fire in Yadadri district : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో లారీ దగ్ధమైంది. జిప్సం లోడుతో వెళ్తున్న లారీ జైతీరాం తండా సమీపంలోని మూలమలుపు వద్ద కాల్వలో బోల్తా పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.

ముల్కలపల్లిలో లారీ దగ్ధం

Lorry fire in Yadadri district : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో లారీ దగ్ధమైంది. గజ్వేల్ నుంచి భువనగిరి వైపు జిప్సం లోడుతో వెళ్తున్న లారీ.. జైతీరాం తండా సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద కాల్వలో బోల్తా పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీలో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

Lorry burnt in Yadadri district : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని.. గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నిత్యం ఈ దారి వెంట ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మూలమలుపు వద్ద ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

ఇవీ చదవండి

రాష్ట్రంలో ఇవాళ చోటుచేసుకున్న నేరాలు :

Nanakramguda Cylinder Blast: అందరు హాయిగా నిద్రపోతున్న సమయంలో ఓ ఇంట్లో గ్యాస్​ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నానక్​రామాగూడాలోని హనుమాన్ దేవాలయం దగ్గర్లోని ఓ ఇంట్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు గ్యాస్​ సిలిండర్ పేలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి (Cylinder Blast) ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం అందుకున్న ఎన్డీఆర్​ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయ చర్యలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Visa Implications: లక్షలు సంపాదించే ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. తమ కుమార్తె సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రవాస వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని (Marrying NRI ) ఆరాటపడుతుంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు. కోరినన్ని లాంఛనాలిచ్చి అట్టహాసంగా వివాహం చేస్తారు. అయితే, మూడుముళ్లు పడ్డాక కాపురానికి వెళ్లే విషయంలో కొందరికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీసా నిబంధనలతో పలువురు ఆగిపోతుండగా.. అల్లుళ్ల మోసాలతో మరికొందరు పుట్టింటికే పరిమితం అవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.