ETV Bharat / crime

17 మంది మహిళల హత్యలతో సంబంధం... నరహంతకుడికి జీవిత ఖైదు

author img

By

Published : May 27, 2022, 2:05 AM IST

Erukali Srinivas
Erukali Srinivas

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17హత్య కేసుల్లో నిందితుడా హంతకుడు. సొంత తమ్మున్నే చంపేసిన చరిత్ర అతనిది. ఎన్నోసార్లు జైలుకు వెళ్లి బైటకు వచ్చాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడ్డాడు. చివరకు 2019లో ఓ మహిళ హత్య కేసులో పోలీసులకు చిక్కగా.. విచారణలో భాగంగా గద్వాల న్యాయ స్థానం అతనికి జీవిత ఖైదు విధించింది.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో అలివేలమ్మ అనే మహిళను హత్యచేసిన కేసులో బాలనగర్ మండలం గండీడ్ గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీనివాసులుకి గద్వాల మూడో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2019 డిసెంబర్ 17న డోకూరు శివారులో అలివేలమ్మ మృతదేహం లభ్యమైంది. క్లూస్ టీం ఇచ్చిన సమాచారంతో ఆమె హత్యలో పాతనేరస్తుల పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఎరుకలి శ్రీనివాసులును విచారించారు. అతని బండారం బైటపడింది. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో జరిగిన విచారణలో నేరం రుజువైంది. న్యాయమూర్తి అతనికి జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.

ఒకటి కాదు రెండు కాదు 17 మంది మహిళల్ని శ్రీనివాసులు హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కల్లు, మద్య తాగే ఒంటరి మహిళల్నే శ్రీనివాసులు లక్ష్యంగా ఎంచుకుంటాడు. ఆభరణాలు ధరించి ఉండే చాలు వారికి మాయమాటలు నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకువెళ్తాడు. హత్యచేసి ఆభరణాల్నిదోచుకుని వెళ్లిపోతాడు. అలివేలమ్మ హత్య కూడా అలాగే చేశాడు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లా శివశక్తినగర్ లో నివాసముండే శ్రీనివాసులు నవాబు పేట మండలం కూచుర్ గ్రామానికి చెందిన చిట్టి అలివేలమ్మ ను మహబూబ్ నగర్ లోని టీ.డీ గుట్ట ప్రాంతంలోని కల్లు దుకాణంలో చూశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి దేవరకద్ర మండలం, డోకూర్ గ్రామశివారులోకి తీసుకెళ్లాడు. కళ్ళు తాగించి, మత్తులోకి వెళ్లిన తర్వాత హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లాడు.

2017లో సొంత తమ్మున్ని హత్య చేసి జైలుకు వెళ్లాడు. బైటకొచ్చాడు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలోని పలు కల్లు కాంపౌడ్ల వద్ద ఒంటరి మహిళలే లక్ష్యంగా హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.పలు మార్లు జైలు శిక్ష అనుభవించాడు. చివరగా 2018 ఆగస్టులో జైలు నుంచి బైటకొచ్చిన శ్రీనివాసులు మిడ్జిల్, భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పోలీసు స్టేషన్ల పరిధిలో నాలుగు హత్యలు చేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లోని ఓ ఇసుక యార్డులో ఓ మహిళ ఎముకల గూడు కనిపించింది. దర్యాప్తు జరిపిన పోలీసులు ఎరుకల శ్రీనివాస్ కు హత్యతో సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేల్చారు. ఇవన్నీ కల్లు దుకాణాల వద్ద ఒంటరి మహిళల్నే లక్ష్యంగా చేసుకుని చేసిన హత్యలే.

2018 ఆగస్టులో జైలు నుంచి విడుదలైన శ్రీనివాసులు కు జైళ్ల శాఖ పెట్రోల్ బంకులో ఉపాధి చూపించారు. అతని ప్రవర్తనలో మార్పు కోసం అధికారులు ప్రయత్నించారు. అయినా విధులకు గైర్హాజరయ్యే వాడు. ఆ తర్వాత 2019లో అలివేలమ్మ హత్యకేసును సవాలుగా తీసుకున్న పోలీసులు అప్పటి ఎస్పీ రెమారాజేశ్వరి, ప్రస్తుత ఎస్పీ వెంకటేశ్వర్లు సూచనలు, ఆదేశాల మేరకు సి.ఐ. రజితా రెడ్డి, ఎస్.ఐ. భగవంత్ రెడ్డిలు సిబ్బంది సహకారంతో కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా చేశారు.

ఇవీ చదవండి:వస్త్ర దుకాణంలో దారుణం.. బాత్‌రూంలో రహస్యంగా కెమెరా పెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.