ETV Bharat / crime

Suicides at Gachibowli: ఇంటర్​ స్టూడెంట్​, ఫ్యాషన్​డిజైనర్​ సూసైడ్​.. కారణాలేంటంటే..?

author img

By

Published : Dec 1, 2021, 4:15 PM IST

Updated : Dec 1, 2021, 10:54 PM IST

Suicides at Gachibowli
Suicides at Gachibowli

Inter Student Suicide: హైదరాబాద్​ గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు ఇంటర్​ విద్యార్థిని కాగా... మరొకరు ఫ్యాషన్​ డిజైనర్​. ఇద్దరు కూాడా ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కారణాలేంటంటే...

Inter Student Suicide: హైదరాబాద్​ గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో ఓ బాలిక, ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ తమ తమ ఇళ్లల్లో ఉరేసుకుని మరణించారు. వాళ్లిద్దరికి ఎలాంటి ఇబ్బందులున్నా.. ఒకే ప్రాంత పరిధిలో ఒకేలా మరణించటం యాదృశ్చికమే.

ఇంద్రానగర్​లో ఓ ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఒడిశాకు చెందిన దేవానంద్ రాయ్,​ బిజిలి రాయ్​ దంపతులు.. గచ్చిబౌలి ఇంద్రానగర్​లో నివాసం ఉంటున్నారు. ఉదయం ఇద్దరూ పనికి వెళ్లిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలిక... చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు విగతజీవిగా ఉండడాన్ని చూసి తండ్రి హతాశుడయ్యాడు. షాక్​ నుంచి తేరుకుని గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుచేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా బాలిక ఒంటరితనంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరితనం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఫ్యాషన్​ డిజైనర్​ ఆత్మహత్య..

fashion designer suicide: గచ్చిబౌలిలోని మైహోం విహంగలో నివాసం ఉంటున్న ఫ్యాషన్​ డిజైనర్​ ఆత్మహత్య చేసుకుంది. శతాబ్ది (32) అనే యువతి తన ఫ్లాట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శతాబ్ది గది నుంచి దుర్వాసన రావడంతో గమనించిన సహచరులు అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీకి సమాచారం అందించారు. గదిలోకి వెళ్లి చూడగా.. విగతజీవిగా కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని.. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి: Farmer Suicide in mulugu: ధాన్యం కుప్ప వద్దే మరో రైతు ఆత్మహత్య..

Last Updated :Dec 1, 2021, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.