ETV Bharat / crime

గదిలో ఏకాంతంగా భార్య, ఆమె ప్రియుడు.. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త.. ఆ తర్వాత.!

author img

By

Published : May 30, 2022, 1:27 PM IST

Extramarital Affairs: జీవిత భాగస్వామిపై అనుమానాలు, వివాహేతర సంబంధాలు.. దంపతుల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. మూడు ముళ్ల బంధానికి కట్టుబడలేక.. అడ్డదారులు తొక్కుతూ.. ఆ తర్వాత తప్పులు చేస్తూ.. తమ జీవితాలనే కాకుండా పక్కవారి జీవితాలను సైతం అంధకారం చేస్తున్నారు. తన భార్య వేరొకరితో సన్నిహితంగా ఉంటుందని తెలిసి.. పలుమార్లు సున్నితంగా మందలించినా వినకపోవడంతో.. ఓపిక నశించి చివరికి హంతకుడిగా మారాడు ఓ భర్త. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

husband murdered wife's lover
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

Extramarital Affairs: భర్తతో మరో యువతి సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఓ వివాహిత.. కిరాయి వ్యక్తులతో సదరు యువతిపై అతి కిరాతకంగా లైంగిక దాడికి ప్రేరేపించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘాతుకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మరో చోట.. భార్య వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిన భర్త.. ఆగ్రహంతో ఇరువురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందాడు.

ఖమ్మం జిల్లా కేంద్రంలో అల్లిపురానికి చెందిన వీరబాబు భార్యతో... అదే ప్రాంతానికి చెందిన నవీన్ అనే యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి విషయం తెలిసిన భర్త.. పలుమార్లు భార్యకు నచ్చజెప్పేందుకు యత్నించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. అనేక సార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టించాడు. వారి సలహాతో దంపతులు ఇటీవల ఖమ్మం శివారులోని గోపాలపురానికి మకాం మార్చారు. అయినా తీరు మార్చుకోని నవీన్... ఆదివారం రాత్రి వీరబాబు ఇంటికి వెళ్లాడు.

ఆటో డ్రైవర్ అయిన వీరబాబు అదే సమయంలో ఇంటికి వెళ్లగా... అతని భార్య, నవీన్‌ ఏకాంతంగా కనిపించడంతో వీరబాబు ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే కత్తితో వారిపై దాడి చేశాడు. ఘటనలో నవీన్​కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన ఇరుగుపొరుగు.. వెంటనే అతడిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: suspected death: అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అనుమానాస్పదస్థితిలో మృతి..!

'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​' పథకానికి మోదీ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.