Theft in meerpet: మీర్​పేట్​లో చోరీ.. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపే..

author img

By

Published : Sep 1, 2022, 2:58 PM IST

Theft in meerpet

Theft in meerpet: హైదరాబాద్​లో దొంగలు రెచ్చిపోయారు. మీర్​పేట్​ పీఎస్​ పరిధిలోని ఓ ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లోకి చొరబడి సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు.

Theft in meerpet: హైదరాబాద్​లోని మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. షరీఫ్​నగర్​లోని ఓ ఇంటిలో చొరబడిన దొంగలు సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును అపహరించారు. ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బంగారంతో ఉడాయించారు. షరీఫ్​నగర్​కు చెందిన ఇంటి యజమాని మహమూద్ అలీ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోగా దుండగులు ఇంటిని గుల్ల చేశారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన బంగారం లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఏస్, ఎస్​వోటీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

నగరంలో మరో డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు.. 8 మంది సభ్యుల అరెస్ట్

ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.