ETV Bharat / crime

క్షుద్రపూజల ఉదంతంలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం

author img

By

Published : Mar 30, 2021, 12:47 PM IST

క్షుద్రపూజలు చేసేందుకు ఆ ఊరు వచ్చాడు. ఆ సమయంలో తన మేనమామ ఇంటికి వచ్చిన ఆ బాలికకు మాయమాటలు చెప్పి తనతోపాటు ఉత్తరప్రదేశ్​కు తీసుకువెళ్లాడు. మామ ఇంటికి వెళ్లిన కుమార్తె రాకపోవడంతో ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100 రోజుల పాటు శ్రమించి.. చివరకు యూపీలో ఆ బాలికను గుర్తించారు.

girl found, girl kidnap, khammam
బాలిక కిడ్నాప్, బాలిక ఆచూకీ లభ్యం

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో గతేడాది డిసెంబర్ 17న కిడ్నాప్​కు గురైన బాలికను పోలీసులు గుర్తించారు. దాదాపు 100 రోజులపాటు శ్రమించి చివరకు ఆమెను ఉత్తరప్రదేశ్​లో కనిపెట్టారు.

రేమిడిచర్లలో క్షుద్రపూజలు నిర్వహించేందుకు వచ్చిన పూజారి సూర్యప్రకాశ్ శర్మ.. ఆ సమయంలో తన మేనమామ ఇంటికి వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పాడని పోలీసులు తెలిపారు. తన వెంట ఆ బాలికను ఉత్తరప్రదేశ్​కు తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. 100 రోజులుగా ఆమె కోసం గాలిస్తున్న తమకు సమాచారం అందడంతో వెంటనే యూపీ వెళ్లి బాలికను రక్షించినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.