ETV Bharat / crime

ROAD ACCIDENT: కారు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ దంపతులు మృతి

author img

By

Published : Mar 9, 2022, 10:16 PM IST

former mptc couple died in road accident: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఘోర రొడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాజీ ఎంపీటీసీ దంపతులు మృతి చెందారు.

former mptc couple died in road accident
former mptc couple died in road accident

mptc couple died at indanpalli in mancherial: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్​పల్లి సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులను మురిమడుగు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శోభారాణి, మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డిగా గుర్తించారు.

ఇందన్​పల్లిలోని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దంపతులిద్దరూ ప్రజాప్రతినిధులు కావడం.. చుట్టుపక్క గ్రామాల ప్రజలకు సన్నిహితంగా ఉండడంతో ఘటనా స్థలంలో రోదనలు మిన్నంటాయి.

ఇదీ చూడండి: Car Burnt On Highway: రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.